చిన్న సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ తెచ్చుకోవడం, జనాన్ని థియేటర్లకు రప్పించేలా చేయడం పెద్ద సవాల్ గా మారుతున్న ట్రెండ్ ఇది. దీన్ని అధిగమించడం ప్రతి నిర్మాత వల్ల కావడం లేదు. కొన్నిసార్లు ఎన్ని ప్రమోషన్లు చేసినా, కెమెరా ముందు పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చినా, ఈవెంట్లు నిర్వహించినా కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రానంత ఫ్లాపులు ఈ ఏడాదే వచ్చాయి. ఇలాంటి పరిస్థితిలో పరస్పరం క్లాష్ కావడం ఏమంత సేఫ్ కాదు. దానికో వెరైటీ ఐడియా చెబుతున్నారు వంశీ నందిపాటి.
వచ్చే నెల డిసెంబర్ 11 ఇడుపు కాయితం, ఇంకా ఏం అనుకోలేదు ఒకే రోజు రిలీజవుతున్నాయి. దేనికవే అంచనాలు పెంచుకునే పనిలో ఉన్నాయి. వీటి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి ఎంత ఘాడమైన ఫ్రెండ్సో అందరికీ తెలిసిందే. క్లాష్ అయిపోయి రెవిన్యూ పంచుకోవడం కన్నా ప్రమోషన్లు షేర్ చేసుకుని ఒకే టికెట్ పై రెండు సినిమాలు చూపిస్తే ఎలా ఉంటుందనే క్రేజీ ఐడియా వంశికి వచ్చింది. అంటే 175 రూపాయలకు రెండు సినిమాలు ఒకే టికెట్ మీద చూపిస్తారంట.
నిజంగా ఇలాంటివి అమలు చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే పైన చెప్పిన రేట్ ప్రకారం ఒక టికెట్ కేవలం 80 రూపాయల లోపే పడుతుంది. ఇప్పుడు బి సెంటర్ సెకండ్ క్లాస్ లో మాత్రమే ఇంత తక్కువ ధర ఉంది. అది కూడా ఒక సినిమాకే. ఇప్పుడిలా డబుల్ బొనాంజ ఇస్తే ఖచ్చితంగా ఎక్కువ శాతం ఆడియన్స్ ఆకర్షితులవుతారు. గతంలో 99 రూపాయలకే రాజు వెడ్స్ రాంబాయి లాంటి స్ట్రాటజీలు మంచి ఫలితాలు ఇచ్చాయి. కాకపోతే ఎక్కువ రోజులు కొనసాగించలేదు.
ఇకపై ఇలాంటి ఆలోచనలు అందరు నిర్మాతలు చేయాలి. ఫ్రీగా గివ్ అవేలు ఇవ్వడం కన్నా ఈ టైపు ఆఫర్లు ఎక్కువ కాలం పని చేస్తాయి. నిజంగా వంశీ, బన్నీ వాస్ ఇవి చేస్తే డిస్ట్రిబ్యూటర్ల మద్దతు ఏ మేరకు దక్కుతుందో చూడాలి. ఎందుకంటే ప్రేక్షకులకు ఒకసారి ఈ తరహా స్కీములు అలవాటు చేస్తే మళ్ళీ అదే ఎక్స్ పెక్ట్ చేస్తారనే భయం వాళ్ళలో ఉంటుంది. కానీ ఎవరో ఒకరు చొరవ తీసుకుంటేనే చిన్న సినిమాల మనుగడ బాగుంటుంది. లేదంటే గిట్టుబాటు కాని ఓటిటి డీల్స్ తో సరిపెట్టుకోవాలి.
This post was last modified on November 10, 2026 10:02 pm
దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో పేరుకుపోతున్న పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. న్యాయ…
ఒకవైపు కాకా పదే పదే జనవరి 13 విడుదల అవుతుందంటూ టీమ్ సోషల్ మీడియాలో ఒకటే ఊరిస్తోంది. ఇంకోవైపు విశ్వంభర…
తాతల నుంచి తండ్రులకు వచ్చిన ఆస్తిలో మనవళ్లకు కూడా సమాన వాటా ఉంటుందా? తండ్రి తనకు వచ్చిన ఆస్తిని విక్రయించాలంటే…
2000 సంవత్సరానికి ముందు రోజుల్లో ఆ భాష, ఈ భాష అని తేడా లేకుండా స్టార్ హీరోలు ఏడాదికి మూణ్నాలుగు…
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ తాను రాసుకున్న జీవిత చవిత్ర బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్…
అగ్రరాజ్యంలో దీపావళి సెలవు.. అనగానే మన దేశంలోనే కదా.. అమెరికాలో ఎందుకు ఉంటుంది? అక్కడి క్రిస్టియన్ నాయకులు దీపావళికి ఎందుకు…