ఉద్యోగం అంటే ఉదయం ఇంటి నుంచి బయలుదేరి ఆఫీసుకు వెళ్లడం లేదా ఇంట్లో ఒకే చోట కూర్చుని గంటల తరబడి పనిచేయడం. అయితే మారుతున్న జీవనశైలికి అనుగుణంగా పని చేసే ప్రదేశాల్లోనూ కొత్త మార్పులు వస్తున్నాయి. ఉద్యోగులు ప్రకృతికి దగ్గరగా ఉంటూ తమ విధులు నిర్వహించుకునేలా తెలంగాణలోని సైబరాబాద్ అధికారులు వినూత్న ప్రయోగానికి సిద్ధమయ్యారు. నగరంలోని పార్కులను ఉద్యోగులు పనిచేసుకునే కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించారు. దీనికి ‘వర్క్ ఫ్రమ్ పార్క్’ అనే పేరు పెట్టారు.
ఈ ఆలోచన వెనుక ప్రధాన ఉద్దేశం ఉద్యోగులకు సాధారణ కార్యాలయ వాతావరణానికి భిన్నమైన అనుభూతిని అందించడం. ఇంటి నుంచి పనిచేసేవారు, స్వతంత్రంగా వృత్తులు నిర్వహించేవారు, చిన్న సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తమకు అనుకూలమైన సమయంలో పార్కుకు వచ్చి పనులు చేసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. పచ్చని చెట్ల మధ్య ప్రశాంతంగా కూర్చుని ల్యాప్‌టాప్‌లో పనులు పూర్తి చేసుకునే అవకాశం కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఇలా చేయడం వల్ల పొల్యూషన్ రహిత వాతావరణంలో వర్క్ చేసుకోవడం వల్ల ఉద్యోగులకు స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి.
ఈ సదుపాయాన్ని ఒక్క ప్రాంతానికే పరిమితం చేయకుండా సైబరాబాద్ పరిధిలోని పలు పార్కులకు విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా 30 నుంచి 40 పార్కులను గుర్తించి అవసరమైన మార్పులు చేయాలని నిర్ణయించారు. ప్రారంభంలో రెండు పార్కుల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. శేరిలింగంపల్లి జోన్‌లోని మసీద్‌బండ ప్రాంతంలో ఉన్న మాధవ హిల్స్ కాలనీ పార్కుతోపాటు మాదాపూర్‌లో మరో పార్కును ఇందుకోసం ఎంపిక చేశారు.
పార్కుకు వచ్చినవారు తమ ఉద్యోగాలకు సంబంధించిన పనులు సౌకర్యంగా చేసుకునేందుకు ప్రత్యేక వసతులు కల్పించనున్నారు. ఇంటర్నెట్ కోసం వైఫై, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు ఛార్జింగ్ సదుపాయం, పని చేసుకునేందుకు డెస్కులు, కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు. పార్కుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సీసీ కెమెరాలను కూడా అమర్చనున్నారు. పని మధ్యలో విరామం తీసుకోవాలనుకునేవారి కోసం టీ, కాఫీ, తినుబండారాలు లభించే చిన్న కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.
ఈ కేంద్రాలను ఉపయోగించుకునే వారికి పెద్ద మొత్తంలో ఖర్చు లేకుండా నామమాత్రపు రుసుము విధించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. నిర్వహణ, విద్యుత్, ఇంటర్నెట్, పారిశుద్ధ్య ఖర్చుల కోసం రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేసే అవకాశం ఉంది. తొలి రెండు కేంద్రాలకు వచ్చే స్పందనను పరిశీలించిన అనంతరం మిగిలిన పార్కుల్లోనూ ఇలాంటి ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును కొత్త సంవత్సరం నాటికి ప్రారంభించాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు.
ఇదే సమయంలో నగరంలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో కొత్తగా సుమారు 300 పార్కులను అభివృద్ధి చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న 97 పార్కులను ఆధునిక సౌకర్యాలతో మెరుగుపరచాలని నిర్ణయించారు. ఈ పనులను వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
పని చేసే ప్రదేశం మారితే ఉద్యోగుల దినచర్యలోనూ కొంత ఉత్సాహం వస్తుంది. ప్రకృతి మధ్య పనిచేసే అవకాశం, అవసరమైన సాంకేతిక సదుపాయాలు ఒకే చోట లభించడం ఈ ఆలోచనలోని ముఖ్యమైన అంశాలు. అయితే ఇంటర్నెట్ వేగం, భద్రత, శబ్ద నియంత్రణ, వాతావరణ పరిస్థితులు వంటి అంశాలపై కూడా అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో నగరాల్లో ఉద్యోగులు పనిచేసే విధానానికి కొత్త దిశ చూపించే అవకాశం ఉంది.
This post was last modified on November 8, 2026 11:18 am
పరిషత్ ఎన్నికల ఫలితాలపై నాయకులు, అభ్యర్థుల రన్నింగ్ కామెంటరీ కొనసాగుతుంది. క్లీన్ స్వీప్ చేశామని అధికార కూటమి చెబుతుండగా రిగ్గింగ్…
మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడం ఒక సంచలనం అయితే ఆయన ఓటమి…
పరిషత్ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేశాయి. మున్సిపల్ ఎన్నికల తరహాలోనే పరిషత్ ఎన్నికల్లో కూడా కూటమి జైత్రయాత్ర కొనసాగింది. కోస్తా,…
సుదీర్ఘ విరామం తర్వాత విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌గా వంగవీటి రాధా విజయం సాధించారు. ఇది ఒక రకంగా రంగా…
ఎటు చూసినా కూటమి పార్టీల ప్రభంజనమే కనిపిస్తోంది. ఏ టీవీ పెట్టినా ఇవే వార్తలు వస్తున్నాయి. ఏం చదివినా కూటమి…
గత ఏడాది చివర్లో హిందీ చిత్రం ‘దురంధర్’ సినిమా ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది…