రాష్ట్రంలో తాజాగా జరిగిన స్థానిక సంస్థలు, పరిషత్ ఎన్నికల ఫలితాలు ప్రత్యక్షంగా నాయకులను ఎన్నుకుంటే .. పరోక్షంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేల పనితీరుకు ప్రజలు మార్కులు వేశారని అంటున్నారు పరిశీలకులు. రెండున్నరేళ్ల తర్వాత ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు వేసిన ఓటుగానే పార్టీలు కూడా భావించే పరిస్థితి వచ్చింది. ఈ ఫలితాలు స్థానిక శాసనసభ్యులక్షేత్రస్థాయి సమన్వయం, ప్రజాదరణకు ఒక పరీక్షగా నిలిచాయి. ఎమ్మెల్యేల పనితీరు. స్థానిక ఎన్నికలపై వాటి ప్రభావం ప్రధానంగా చర్చకు వస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయాన్ని సాధించడంతో, అత్యధిక నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల హవా స్పష్టంగా కనిపించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం వంటి నియోజకవర్గాల్లో జనసేన, అలాగే సీఎం చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పం, జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల వంటి కీలక ప్రాంతాల్లో కూటమి తరఫున ఎమ్మెల్యేలు ఓటర్లను ఆకట్టుకోవడంలో విజయవంతమయ్యారు. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ నమోదు చేసింది.
అయితే.. కొన్ని నియోజకవర్గాల్లో కూటమి పార్టీల(టీడీపీ-జనసేన-బీజేపీ) మధ్య సీట్ల సర్దుబాటులో స్థానిక ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నేతలను కలుపుకొని వెళ్లడంలో విఫలమయ్యారు. సాలూరు, నెల్లిమర్ల, ఆదోని వంటి ప్రాంతాలలో స్థానిక ఎమ్మెల్యేల వైఫల్యం లేదా అంతర్గత విభేదాల వల్ల కూటమికి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. నెల్లిమర్లలో తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థి విజయం సాధించడం ఇందుకు ఉదాహరణ.
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికలు సాగినప్పటికీ, స్థానిక ఎమ్మెల్యేల కంటే అభ్యర్థుల వ్యక్తిగత పరిచయాలు, ప్రజలకు అందుబాటులో ఉండటం, స్థానిక సమస్యలపై స్పందన వంటి అంశాలే ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేశాయి. బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రజలతో తిరిగి మమేకమవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ అక్కడ మెరుగైన ప్రదర్శన కనబరిచి, కొన్ని వార్డులను కైవసం చేసుకోగలిగింది.
ఈ ఎన్నికలలో చెప్పుకోదగ్గ మరో విషయం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రతిపక్ష నేతలు, మాజీ ఎమ్మెల్యేలు తమ పట్టున్న కోటలను కూడా కాపాడుకోలేకపోయారు. ముఖ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల మున్సిపాలిటీ, జెడ్పీటీసీ స్థానాలను కూడా టీడీపీ కైవసం చేసుకోవడం గమనార్హం. ఇక్కడ వాస్తవానికి వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి సహా.. బలమైన కేడర్ ఉన్నప్పటికీ.. ప్రజాతీర్పు ముందు వారు చతికిల పడాల్సి వచ్చిందనే చెప్పాలి.
This post was last modified on November 8, 2026 5:18 pm
ఇప్పుడు ఎక్కడ చూసినా రామాయణ పార్ట్ 1 కు వచ్చిన స్పందన, రికార్డు కలెక్షన్ల గురించిన చర్చే జరుగుతోంది. హిందీలోనే…
ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ మళవిక మోహనన్. తాజాగా ఈ ముద్దుగుమ్మ.. తన…
తాజాగా జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం, గుడివాడ…
డిసెంబర్ 24 విడుదల కాబోతున్న దాదా మీద బాలకృష్ణ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాది అఖండ 2…
ప్రస్తుతం ఏపీలో జరిగిన స్థానిక ఎన్నికల్లో కూటమి తరఫున అభ్యర్థులు విజయం దక్కించుకున్నా.. ఎక్కడో ఒక తరహా అసంతృప్తి అయితే..…
జైలుకు వెళ్లిన నాయకులు రాజకీయాల్లో సక్సెస్ అవుతున్నారనే మాట మరోసారి నిజమైంది. తాజాగా జరిగిన జడ్‌పీటీసీ ఎన్నికల్లో ఓ నాయకుడు…