పరిషత్ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేశాయి. మున్సిపల్ ఎన్నికల తరహాలోనే పరిషత్ ఎన్నికల్లో కూడా కూటమి జైత్రయాత్ర కొనసాగింది. కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలన్నీటిలోనూ ఒకటే రిజల్ట్స్ వచ్చాయి. కూటమి ఏకపక్ష విజయం సాధించింది. బీ ఫాం తీసుకొని అధికారికంగా కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన వారే కాదు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి రెబల్ గా పోటీకి దిగిన వారిలో కూడా కూటమి అభ్యర్థులే విజయం సాధించడం గమనార్హం. అంటే అధికశాతం ప్రజల్లో వైసీపీ పట్ల ఎంత వ్యతిరేకత వుందో అర్ధం అవుతుంది.
నెల్లూరు జిల్లాలోని ఇందుకూరు, జలదంకి, ఆత్మకూరు, వెంకటాచలం మండలాల్లో ఆరుగురు రెబల్ అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఆరుగురు రెబల్ అభ్యర్థులు కూడా టీడీపీ సీటు దక్కక పోవడంతో పోటీ చేసిన వారే. శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 16 మంది రెబల్స్ గెలుపు జెండా ఎగరేయగా దాదాపుగా వారంతా టీడీపీకి చెందినవారే అత్యధికంగా వున్నారు.
తిరుపతి జిల్లాలో ఆరుగురు స్వతంత్రులు విజయం సాధించారు. వారిలో ఐదుగురు టీడీపీ, ఒకరు జనసేన రెబల్ అభ్యర్థి వున్నారు. కాకినాడలో ఐదుగురు, పిఠాపురంలో ఒకరు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు టీడీపీ, జనసేన రెబల్స్ గెలిచారు. విజయనగరం జిల్లాలో అయితే ఏకంగా 28 మంది రెబల్స్ గెలిచారు. కృష్ణాలో 8 మంది గెలిచారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 66 స్థానాల్లో స్వతంత్రులు విజయ పతాకం ఎగరేశారు. చివరి ఫలితాలు బట్టి మరికొన్ని స్థానాల్లో కూడా గెలిచే అవకాశం వుందని తెలుస్తోంది. నిజానికి రెబల్ అభ్యర్థి నిలబడిన చోట అధికారికంగా పోటీ చేసిన అభ్యర్థితో పాటుగా రెబల్ అభ్యర్థి కూడా ఓటమి పాలవుతారు. ఒకే పార్టీ తరుపున ఇద్దరు పోటీ పడితే ఓట్లు చీలి మధ్యలో మూడో పార్టీ గెలుస్తుంది. వైసీపీ కూడా అదే అంచనా వేసుకుంది. అయితే ప్రజలు మాత్రం వైసీపీ వైపు కన్నెత్తి చూళ్ళేదు. టీడీపీ అధికారిక, తిరుగుబాటు అభ్యర్థులలో ఒకరిని ఎన్నుకున్నారు. ఇది వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు.
This post was last modified on November 8, 2026 10:57 am
మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడం ఒక సంచలనం అయితే ఆయన ఓటమి…
ఉద్యోగం అంటే ఉదయం ఇంటి నుంచి బయలుదేరి ఆఫీసుకు వెళ్లడం లేదా ఇంట్లో ఒకే చోట కూర్చుని గంటల తరబడి…
సుదీర్ఘ విరామం తర్వాత విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌గా వంగవీటి రాధా విజయం సాధించారు. ఇది ఒక రకంగా రంగా…
ఎటు చూసినా కూటమి పార్టీల ప్రభంజనమే కనిపిస్తోంది. ఏ టీవీ పెట్టినా ఇవే వార్తలు వస్తున్నాయి. ఏం చదివినా కూటమి…
గత ఏడాది చివర్లో హిందీ చిత్రం ‘దురంధర్’ సినిమా ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. దానికి కొనసాగింపుగా ఈ ఏడాది…
రామాయణ పార్ట్ 1 సక్సెస్ తో రన్బీర్ కపూర్ మంచి హుషారు మీదున్నాడు. పేరు తెచ్చుకునే విషయంలో యష్ పోటీ…