పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం రెడీ కాబోతున్నాడు. రంగస్థలం కాంబో రిపీట్ చేస్తూ సుకుమార్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అక్టోబర్ 20 ఓపెనింగని లేటెస్ట్ అప్డేట్. అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపు పక్కానే. సంగీత దర్శకుడి గురించి రకరకాల ప్రచారాలు ముందు నుంచి జరుగుతూనే ఉన్నాయి. దురంధర్ ఫేమ్ శాశ్వత్ సచ్ దేవ్ పేరు ఎక్కువగా వినిపించింది.
అయితే తాజా లీక్ ప్రకారం ఈ కాంబోకి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఆర్య టు పుష్ప 2 సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ స్నేహబంధం పాతికేళ్లకు పైగా కొనసాగుతూ వస్తోంది. అయితే పుష్ప టైంలో తలెత్తిన పలు ఇష్యూస్ వల్ల ఆ సినిమా రీ రికార్డింగ్ లో కొంత భాగం సామ్ సిఎస్ చేసిన సంగతి తెలిసిందే. మైత్రి సంస్థతో ఉన్న దేవికున్న విభేదాలు కూడా దీనికి ఒక కారణంగా ఫిలిం నగర్ లో చెప్పుకుంటారు.
ఇక అనిరుధ్ విషయానికి వస్తే ఆర్సి 17కి నిజంగా పని చేస్తే మెగా ఫ్యాన్స్ సంతోషంగా ఫీలయ్యే వార్తే. అయితే అభిమానులు ముద్దుగా బక్కోడు అని పిలుచుకునే ఈ మ్యూజిక్ సెన్సేషన్ కొంత కాలంగా తన స్థాయి మ్యూజిక్ ఇవ్వడం లేదు. ప్యారడైజ్ లో ఆయా షేర్ మాత్రమే తనకు ఏడాది కాలంలో దక్కిన బెస్ట్ సాంగ్. యెషనాగుల రీమిక్స్ కాబట్టి దాన్ని కౌంట్ లోకి తీసుకోలేం. కూలి, ఇండియన్ 2, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మొదలైనవి సోసో ఆల్బమ్స్ గా నిలిచాయి.
మరి సుకుమార్ తనతో ఎలాంటి అవుట్ ఫుట్ రాబట్టుకుంటాడో చూడాలి. మూవీ లవర్స్ మటుకు శాశ్వత్ అయ్యుంటే బాగుండేదని ఇప్పటికీ అదే అభిప్రాయంలో ఉన్నారు. అలాని అనిరుధ్ కి తక్కువంచనా వేయలేం. తనదైన కంటెంట్ దొరికిన రోజు జైలర్, దేవర, విక్రమ్ తరహాలో విశ్వరూపం చూపిస్తాడు. కరెక్ట్ గా చెప్పాలంటే అనిరుధ్ వల్ల ఫ్లాప్ అయిన సినిమాలు లేవు. అవన్నీ కంటెంట్ వల్ల పోయినవి. మరి రామ్ చరణ్ ప్రాజెక్ట్ నిజంగా చేతికి వస్తే కెరీర్ బెస్ట్ ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ కోరిక.
Gulte Telugu Telugu Political and Movie News Updates