Trends

ఈసారి చలికాలం లేనట్టే

సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా కాలం ఉంటుంది. అయితే వాతావరణంలో చోటు చేసుకుంటున్న పెను మార్పుల కారణంగా గత కొంతకాలంగా ఋతువుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సూపర్ ఎల్ నినో దేశంలో బలంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో దీని ప్రభావం ఎక్కువగా చూపుతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో చలికాలం మాయమైనట్లేనని నిపుణులు చెబుతున్నారు.

నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. వేసవి కాలం వెళ్లి పోయినప్పటికి ఇప్పటికీ ఎండలు అదర గొడుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వర్షాకాలం వచ్చింది కాని సరిపడా వర్షాలు కురవలేదు. నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ 19 నుంచే తిరుగుముఖం పట్టినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా అయితే నైరుతి రుతు పవనాలు నిష్క్రమించిన తరువాత ఈశాన్య రుతు పవనాలు ప్రవేశించాల్సి ఉంటుంది. అదికూడా ఎంత ప్రభావం చూపుతుందో వాతావరణ శాఖ చెప్పలేక పోతోంది. తెలంగాణాలో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 30 శాతంపైగా లోటు వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు.

సాధారణంగా నవంబర్, డిసెంబర్ మాసాల్లో చలి ఎక్కువగా ఉంటుంది. విపరీతంగా మంచు కురుస్తుంది. ఫిబ్రవరి చివరి వరకు చలికాలం ఉంటుంది. కానీ ఈసారి అక్టోబర్ నెల వచ్చినప్పటికీ ఎండలు తగ్గలేదు కదా మండిపోతున్నాయి. నాలుగు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్​, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్​నగర్​లో 35 నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కడప, పల్నాడు జిల్లాల్లో కూడా 35 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇవి సాధారణం కన్నా 4 డిగ్రీలు ఎక్కువ.

రానున్న రెండు నెలల్లో ఎల్​నినో ప్రభావం మరింత తీవ్రంగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రపంచంలోనే భారత దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు చెబుతున్నాయి. అందులోనూ దక్షిణ భారతదేశంలో మరింత ఎక్కువగా ఎండలు ఉంటాయని, 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. ఈసారి వడగాలులకు జనాలు పిట్టల్లా రాలిపోయే ప్రమాదం వుందని చెబుతున్నారు.

This post was last modified on October 10, 2026 11:43 am

Share

Recent Posts

కూలీ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటో

ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…

7 minutes ago

ఇకపై జగన్ రోజూ కోర్టుకు వెళ్లాల్సిందేనా

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…

1 hour ago

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

5 hours ago

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…

6 hours ago

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

10 hours ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

11 hours ago