థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను ఒంటరిగా నడిపారు. సాధారణంగా రాజకుటుంబ సభ్యులు విమానాల్లో ప్రయాణించడం చూస్తుంటాం. కానీ సుతిదా స్వయంగా యుద్ధ విమానాన్ని నడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆమె గతం గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
సుతిదా రాజకుటుంబంలో పుట్టలేదు. రాణి కాకముందు విమానయాన సంస్థల్లో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేశారు. మొదట జపాన్ ఎయిర్‌లైన్స్‌లో, తర్వాత థాయ్ ఎయిర్‌వేస్‌లో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత రాజకుటుంబ భద్రతా విభాగంలో చేరారు. అక్కడ సైనిక శిక్షణ కూడా తీసుకున్నారు. 2019లో థాయ్‌లాండ్ రాజు మహా వజిరాలాంగ్‌కార్న్‌ను వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి థాయ్‌లాండ్ రాణిగా కొనసాగుతున్నారు.
అయితే సుతిదాకు విమానాలు నడపడంలో కూడా అనుభవం ఉంది. 2010లోనే పైలట్ శిక్షణ తీసుకున్నారు. వివిధ రకాల విమానాలను నడిపారు. ఇప్పటివరకు 1,188 గంటలకు పైగా విమానాలు నడిపిన అనుభవం సంపాదించారు. థాయ్ రాజుతో కలిసి బోయింగ్ విమానాల్లో కోపైలట్‌గా కూడా వ్యవహరించారు. ఇప్పుడు యుద్ధ విమానం నడిపేందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు.
గ్రిపెన్ ఫైటర్ జెట్ కోసం 45 అంశాల్లో శిక్షణ పొందారు. విమానంలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలో నేర్చుకున్నారు. సిమ్యులేటర్‌లో 20 సార్లు ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత శిక్షకుడితో కలిసి యుద్ధ విమానంలో దాదాపు పది గంటలు ప్రయాణించారు. ఈ శిక్షణ పూర్తయ్యాక ఒంటరిగా విమానం నడిపేందుకు సిద్ధమయ్యారు.
అక్టోబర్ 8న థాయ్‌లాండ్‌లోని సూరత్ థానీ ఎయిర్‌బేస్ నుంచి జేఏఎస్ 39సీ గ్రిపెన్ యుద్ధ విమానంతో బయలుదేరారు. దాదాపు 41 నిమిషాల పాటు గాల్లో ప్రయాణించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. థాయ్ రాజు కూడా అక్కడే ఉండి ఈ ప్రయాణాన్ని వీక్షించారు. విమానం దిగిన తర్వాత సుతిదాకు పూలగుత్తి అందించి అభినందించారు.
This post was last modified on October 9, 2026 5:23 pm
ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…