ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ జరుగుతుంది. ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చేసేందుకు ఒమన్ దేశానికి చెందిన పైలట్ ప్రయత్నం చేయడం, ప్రయాణికుల ప్రాణాలు రక్షించేందుకు ఇండియన్ పైలట్ స్మిత్ మచ్చర్ ప్రాణాలకు తెగించి పోరాటం చేయడం అచ్చం సినిమా సీన్లను తలపించింది. స్మిత్ ధైర్యాన్ని సామాన్య పౌరుడి నుంచి ప్రధాన మంత్రి వరకు పొగడ్తలు కురిపిస్తున్నారు.
ఇదే క్రమంలో స్మిత్ తండ్రి భూపేంద్ర మచ్చర్ స్పందించిన తీరు మనసులు కదిలించి వేస్తోంది. తన కుమారుడి సాహసంపై గర్వంగా ఉన్నప్పటికీ.. అతడు పూర్తిగా కోలుకోవడమే తమకు ముఖ్యమని భూపేంద్ర మచ్చర్ స్పష్టం చేశారు. స్మిత్ 17 ఏళ్లుగా పైలట్ గా పనిచేస్తున్నాడని, ఎప్పుడూ ఇలాంటి ఘటన ఎదురు కాలేదన్నారు. వందలాది మంది పైలట్లకు మార్గనిర్దేశం చేసిన అతడు వందలాది మంది ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలు ఫణంగా పెట్టేందుకు కూడా సిద్ధమవడం గర్వంగా ఉందన్నారు. ఫ్లైయింగ్ అతడికి భార్య లాంటిదని చెప్పడం ద్వారా అతడు వృత్తి పట్ల ఎంత నిబద్దతగా ఉంటాడో స్పష్టం చేశాడు .
విమానంలోని కాక్ పిట్ లో జరిగిన దాడిలో గాయపడిన స్మిత్ మచ్చర్ తలకు, చేతులకు తీవ్రంగా గాయలయ్యాయి. అబూదాబిలోని ఆసుపత్రిలో తలకు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతానికి స్మిత్ సేఫ్ గా వున్నాడు. పూర్తిగా కోలుకునేందుకు ఇంకొన్ని రోజులు పడుతుందని వైద్యులు ప్రకటించారు. అదే విషయం స్మిత్ తండ్రి భూపేంద్ర కూడా మీడియకు వెల్లడించారు. స్మిత్ దాడికి గురయ్యాడని తెలియగానే మా కుమారుడికి సంబంధించి ఎలాంటి దురదృష్ట వార్త వినకూడదని దేవుణ్ని వేడుకున్నాం. కాస్త టెన్షన్ కు గురయ్యాం. వెంటనే ఆలయానికి వెళ్లి దీపం వెలిగించామని తెలిపారు.
స్మిత్ ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులే కాదు యావత్ దేశం ఆందోళనకు గురైంది. తమ హీరో పూర్తిగా ఆరోగ్యంగా వున్నాడని తెలిసి ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు స్మిత్ హాస్పిటల్ నుంచి ఎప్పుడు బయటకు వస్తాడాని దేశం ఎదురు చూస్తుంది. దేశ ప్రతిష్టను కాపాడిన హీరోకు జేజేలు పలికెందుకు యువత సిద్ధం అవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
