ఏఐ చిప్స్‌తో ప్రపంచ టెక్నాలజీని షేక్ చేస్తున్న ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ఇప్పుడు తన వ్యక్తిగత వ్యవహారాలతో వార్తల్లోకి ఎక్కారు. ఇప్పటివరకు చిప్స్, ఏఐ, బిలియన్ డాలర్ల వ్యాపారంతో హెడ్‌లైన్స్‌లో కనిపించిన ఆయన.. ఇప్పుడు రిలేషన్‌షిప్ ఆరోపణలతో చర్చనీయాంశంగా మారారు. ఇప్పటికే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందంటూ వార్తలు రావడంతో వివాదంలో చిక్కుకున్న జెన్సన్‌కు తాజాగా మరో సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది. ఈసారి ఆరోపణల్లో వినిపిస్తున్న పేరు కూడా ఆయన పనిచేస్తున్న కంపెనీకి చెందినదే కావడం అసలు ట్విస్ట్.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఎన్విడియాలో హెల్త్‌కేర్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న కింబర్లీ పావెల్‌తో జెన్సన్ సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కంపెనీకి చెందిన మాజీ ఉద్యోగులు వెల్లడించిన వివరాల ఆధారంగా ఈ కథనం ప్రచురితమైంది. శాన్‌జోస్‌లో జరిగిన ఓ కంపెనీ సమావేశం సందర్భంగా వీరిద్దరూ ఒకే హోటల్‌లో సన్నిహితంగా కనిపించారనే విషయాన్ని కూడా కథనంలో ప్రస్తావించారు.
ఇక్కడే నెటిజన్లకు అసలు ఆసక్తికరమైన పాయింట్ కనిపిస్తోంది. సాధారణంగా ఉద్యోగులు ఆఫీసులో మీటింగులు, ప్రాజెక్టులు, డెడ్‌లైన్లతో బిజీగా ఉంటారు. కానీ సీఈఓ వ్యక్తిగత జీవితానికి సంబంధించి అదే ఆఫీసులో పనిచేసే ఉన్నతాధికారిణి పేరు వినిపించడం కార్పొరేట్ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. అయితే ఈ ఆరోపణలు నిజమని ఇప్పుడే నిర్ధారించలేం.
ఇప్పటికే జెన్సన్ వ్యక్తిగత సంబంధాలపై మరో వివాదం వెలుగులోకి రావడంతో ఆయన నాయకత్వంపై కూడా ప్రశ్నలు మొదలయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన ఎన్విడియాకు ఇలాంటి వార్తలు రావడం పెట్టుబడిదారులకూ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కంపెనీకి సంబంధించిన ప్రతి పరిణామం మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
మరోవైపు జెన్సన్ పదవిపై కంపెనీ బోర్డు చర్చించవచ్చంటూ కొన్ని అంతర్జాతీయ కథనాలు రావడం పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చింది. అయితే ఆయనను పదవి నుంచి తొలగించే విషయంలో ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడలేదు. మొత్తానికి ఏఐ ప్రపంచంలో కొత్త కొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్న ఎన్విడియాలో ఇప్పుడు మరో రకమైన చర్చ మొదలైంది. టెక్నాలజీ అప్‌డేట్స్‌తో కాకుండా రిలేషన్‌షిప్ ఆరోపణలతో కంపెనీ పేరు ట్రెండింగ్‌లోకి రావడం మాత్రం ఊహించని పరిణామమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates
