ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు పార్టీలు.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. కూటమి పార్టీలుగా ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన, ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా.. ఉత్తరాంధ్రపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతుండడం గమనార్హం. దీనిలో ప్రధానంగా టీడీపీ, జనసేనలు మరింత దూకుడు పెంచాయి.
ఎలాగంటే…
టీడీపీ విషయానికి వస్తే.. నగరాలు, పట్టణాలపై పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. నగర జనాలను కలుస్తున్నతీరు కనిపిస్తోంది. ఇక, పట్టణాల్లోనూ దూకుడు పెంచుతోంది. అదేసమ యంలో పార్టీ పరంగా కూడా నాయకుల చేరికలపై దృష్టి పెట్టింది. ఇటీవల బొత్స మేనల్లుడు శ్రీనివాసరావు చేరిన విషయం తెలిసిందే. వచ్చే స్థానిక సమరం నాటికి.. ఈ లెక్కలుమరింత పెరగనున్నాయి. సో.. విజయనగరం, విశాక, శ్రీకాకాళంలో పార్టీ ప్రజలకు మరింత చేరువ అవుతోంది.
ఇక, జనసేన విషయానికి వస్తే.. ఉత్తరాంధ్రలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. తద్వారా వైసీపీ ఓటు బ్యాంకును విచ్చిన్నంచేసి.. జనసేన పుంజుకునే ప్లాన్ అమలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ఎస్టీలు నివసించే కొండ ప్రాంతాల్లో కూడా పార్టీ పుంజుకునే లా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు గిరిజన సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన మాట జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.
బీజేపీ: స్వతహాగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ కూడా.. ఉత్తరాంధ్ర పై పెద్దగానే ప్రణాళికలు వేసింది. విశాఖపై కొంత మేరకు పట్టుపెంచుకున్న బీజేపీ.. ఇప్పుడు విజయనగరంపైనా దృష్టి పెట్టింది. ఇక్కడి రామాలయం అబి వృద్ధి.. వైసీపీ హయాంలో రామతీర్థం ఘటన వంటివాటిని హైలెట్ చేస్తుండడం గమనార్హం. తద్వారా.. హిందూత్వ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మూడు పార్టీలుకలిసే ఉన్నప్పటికీ.. సొంత ఓటు బ్యాంకును స్థిరీకరించుకునే దిశగా అడుగులు వేస్తుండడం గమనార్హం.
వైసీపీ: ప్రస్తుతం డోలాయమానంలో ఉన్న పార్టీ వైసీపీ. ఒకప్పుడు ఉత్తరాంధ్రపై తన ముద్ర వేసిన వైసీపీ ఇప్పుడు ఆ ప్రభావం కోల్పోతోంది. విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు.. ఉన్న ప్రభావం ఇప్పుడు లేదు. దీంతో ఇప్పుడు మరింత గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో నాయకుల ఎంగేజ్ సహా.. కుటుంబ సమస్యలు పరిష్కరించుకునే దిశగా నాయకులను ప్రోత్సహిస్తోంది. ఓటు బ్యాంకుపై ప్రభావం పడరాదని తాజాగా జగన్ తేల్చి చెప్పారు. మొత్తంగా పరిణామాలు.. పార్టీల్లో జోష్ పెంచుతున్నాయి.
This post was last modified on October 2, 2026 8:58 am
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…