Political News

ట్రంప్‌తో పెట్టుకుంటే అంతే… సొంత‌ టీవీ పెట్టేశారు!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. వ్య‌వ‌హారం లేచిందే లేడికి ప‌రుగు అన్న‌ట్టుగానే ఉంటుంది. ఆయ‌న ప‌ట్టిన కుందేలుకు మూడు కాళ్లేన‌ని ఆయ‌న చెబితే.. అంద‌రూ త‌ల‌లూపాల్సిందే. లేక‌పోతే తిట్టిపోస్తారు.. లేదా ఇంకేమైనా చేస్తారు. ఇది ఏ వ‌ర్గానికైనా వ‌ర్తిస్తుంది. రెండు రోజుల కింద‌ట‌.. ఇరాన్ విష‌యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యంతోపాటు.. ర‌ష్యాపై ఆంక్ష‌ల విధానాన్ని కూడా విమ‌ర్శిస్తూ.. ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా కొన్ని చానెళ్లు వార్త‌ల‌ను ప్ర‌సారం చేశాయి. వాస్త‌వానికి ప్ర‌పంచంలో అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశాల్లో అమెరికా కూడా ముందుంది. అంతేకాదు.. భావ‌ప్ర‌క‌ట‌న‌కు.. నిర‌స‌న‌ల‌కు కూడా ఇక్క‌డ ప్ర‌భుత్వాలు పెద్ద‌గా అడ్డు చెప్ప‌వు.

కానీ, ట్రంప్ మామూలోడు కాదుక‌దా!. నేను తీసుకున్న నిర్ణ‌యాన్ని మీరెందుకు వ్య‌తిరేకిస్తున్నారో చెప్పాలి అంటూ.. స‌ద‌రు మీడియా సంస్థ‌లైన సీఎన్ ఎన్‌, ఎంఎస్‌ నౌ, పొలిటికోల‌ను ప్ర‌శ్నించారు. అంతేకాదు.. వివ‌ర‌ణ‌కు 24 గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఇచ్చారు. దీంతో ఈ మూడు ప‌త్రిక‌లు/ మీడియా సంస్థ‌లు కూడా ట్రంప్‌పై నిప్ప‌లు చెరిగాయి. ప్ర‌జాస్వామ్య దేశంలో ఉన్నామా.. నిరంకుశ పాల‌న‌లో ఉన్నామా? అంటూ.. ప్ర‌ధాన క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేశాయి. దీంతో మ‌రింత చిర్రెత్తుకొచ్చిన ట్రంప్‌.. ఈ మూడు సంస్థ‌ల‌ను వైట్ హౌస్ ప్రాంగ‌ణంలోకి అనుమ‌తించ‌వ‌ద్ద‌ని ఆదేశాలు జారీ చేశారు. ఇంకేముంది.. అధ్య‌క్షుడి మాటే ఫైన‌ల్ కాబ‌ట్టి అధికారులు అమ‌లు చేశారు.

ఇక‌, ఈ నిర్ణ‌యంపై ఆయా సంస్థ‌లు కోర్టుకు వెళ్లాయి. కోర్టులో విచార‌ణ జ‌ర‌గాల్సి ఉంది. ఇంత‌లో.. ఈ మూడు సంస్థ‌ల‌కు బాస‌ట‌గా ఇత‌ర మీడియా చానెళ్లు కూడా ట్రంప్ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతూ.. ఆయ‌న కార్య‌క్ర‌మాల‌ను క‌వ‌ర్ చేసేది లేద‌ని పేర్కొన్నాయి. ఇంకేముంది.. ట్రంప్ కు మ‌రింత ఆగ్ర‌హం పెరిగిపోయింది. ఆ వెంట‌నే మ‌న‌మే సొంత టీవీ పెట్టుకుందాం.. అని ప్ర‌తిపాదించారు. ఆ ప్ర‌తిపాద‌న అలా రాగానే.. ఇలా ప‌నులు కూడా ప్రారంభ‌మ‌య్యాయి. సొంత నిధుల‌తోనే ట్రంప్ సొంత టీవీ పెట్టుకున్నారు. దీని పేరు ట్రంప్ టీవీ ఇది 24/7 ప్ర‌సారాలు అందిస్తుంది. వెంట‌నే దీనికి సంబంధించిన అనుమ‌తులు కూడా వ‌చ్చేశాయి. ఫ‌లితంగా వైట్ హౌస్ కార్య‌క్ర‌మాల‌ను అధికారికంగా ప్ర‌సారం చేసేందుకు హ‌క్కులు కూడా వ‌చ్చేశాయి. దీనిని తాజాగా ట్రంప్ ప్రారంభించారు.

గ‌తంలోనూ..

ఇక‌, ట్రంప్ వ్య‌వ‌హార శైలిని గ‌మ‌నిస్తే.. గ‌తంలోనూ ఆయ‌న ఇలానే దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ట్విట్ట‌ర్ విష‌యంలో త‌లెత్తిన వివాదంతో ఆయ‌న తీవ్రంగా స్పందించారు. తాను చేసిన పోస్టుల‌ను డిలీట్ చేస్తున్నార‌ని..(అప్ప‌ట్లో ఆయ‌న ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు) ఇది స‌రికాద‌నిబండ‌బూతులు తిట్టారు. దీంతో ట్విట్ట‌ర్ ఆయ‌న ఖాతాను కూడా ర‌ద్దు చేసింది. దీంతో వెంట‌నే ట్రంప్ సొంత సోష‌ల్ మీడియాను ప్రారంభించారు. “ట్రూత్ సోష‌ల్‌` పేరుతో ఆయ‌న దీనిని ప్రారంభించారు. తొలి నాళ్ల‌లో ట్విట్ట‌ర్‌పై విరుచుకుప‌డ్డారు. త‌న‌ది మాత్ర‌మే నిఖార్స‌యిన‌, నిజ‌మైన సోష‌ల్ మీడియా అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏకంగా టీవీ పెట్టేశారు. ఇదీ.. ట్రంప్ సంగ‌తి!!.

This post was last modified on September 23, 2026 12:02 pm

Share

Recent Posts

రజినీ కొట్టకూడదని కండిషన్

80, 90 దశకాల్లో తన డిస్కో డ్యాన్సులతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన నటుడు మిథున్ చక్రవర్తి. ఇప్పటికీ…

24 minutes ago

ఆ నటిని వేధించిన దర్శకుడెవరు?

నీతి టేలర్.. ఈ పేరు గుర్తుందా? ‘నచ్చావులే’ ఫేమ్ తనీష్ అల్లాడి హీరోగా నటించిన ‘మేం వయసుకు వచ్చాం’ అనే…

4 hours ago

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

7 hours ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

8 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

10 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

10 hours ago