Trends

ఉద్యోగాలు ఊడుతున్నాయ్‌.. ల‌క్ష‌ల మంది వీధిపాలు.. కార‌ణాలేంటి?

ఒక‌టి కాదు.. రెండు కాదు… ఏకంగా వేలు.. ల‌క్ష‌ల్లోనే ఉద్యోగాలకు ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌లు మంగ‌ళం పాడుతున్నాయి. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఫోక్స్ వ్యాగ‌న్ కార్ల త‌యారీ సంస్థ ల‌క్ష మందిని తొల‌గించ‌నున్నట్టు ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే 50 వేల మందిని తొల‌గించిన‌ట్టు కూడా ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఒక‌, తాజాగా జాగ్వార్ సంస్థ కూడా.. ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న‌ట్టు పేర్కొంది. మ‌రో వైపు ఒరాకిల్ సంస్థ కూడా.. వ‌చ్చే రెండేళ్ల‌లో 10 వేల మందిని ఇంటికి పంపిచేస్తామ‌ని తెలిపింది. జాగ్వార్ సంస్థ‌.. టాటాతో క‌లిసి కార్ల‌ను ఉత్ప‌త్తి చేస్తోంది. అయితే.. ఇప్పుడు ఈ సంస్థ‌.. పెద్ద ఎత్తున ఉద్యోగాల‌ను ఎత్తేయాల‌ని నిర్ణ‌యించింది.

ఒరాకిల్ సంస్థ ఈ ఏడాదిలో అత్యధికంగా ఉద్యోగాలు తీసివేసిన సంస్థల్లో ముందుంది. ఇప్పటికే 21 వేల మందిని తొలగించగా, త్వరలో మరో 3 వేల నుంచి 4 వేల మంది వరకు ప‌క్క‌న పెట్ట‌నుంది. గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం అనగా సుమారు 3,300 నుంచి 3,400 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. వివిధ విభాగాల్లో కలిపి 17,267 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. మెటా, డెల్ సంస్థ‌లు కూడా ఈలైన్‌లోనే ఉన్నాయి. మెటా 10,400 మందిని, డెల్ 11,000 మంది ఉద్యోగులను కోల్పోయేలా లేఆఫ్స్ ప్రకటించాయి. ఇక‌, ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్, పేపాల్, సిస్కో, జాగ్వార్ ల్యాండ్ రోవర్, జొమాటో వంటి కంపెనీలు కూడా తమ వ్యయాలను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తగ్గిస్తున్నాయి.

ఎందుకిలా..

ఆయా కంపెనీలు ఇలా ఎందుకు చేస్తున్నాయ‌న్న‌ది ప్ర‌శ్న‌. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ప్ర‌పంచ దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధాలు.. ఆర్థిక ప‌రంగా ఎదుర‌వుతున్న అనిశ్చిత ప‌రిస్థితి నెల‌కొంది. ముఖ్యంగా సుదీర్ఘ‌కాలంగా సాగుతున్న ఉక్రెయిన్‌-ర‌ష్యా దేశాల మ‌ధ్య యుద్ధంతో ఐరోపా దేశాల్లో భారీ అనిశ్చితి నెల‌కొంది. ఇక‌, అమెరికా జోక్యంతో ప‌శ్చిమాసియాలోని ఇరాన్‌పై జ‌రుగుతున్న యుద్ధం కూడా ప్ర‌పంచ దేశాల‌పై ప్ర‌భావం ప‌డింది. ముఖ్యంగా.. ముడిస‌రుకుల ర‌వాణా నిలిచిపోవ‌డం.. పెట్రోల్ ఉత్ప‌త్తులు ఆగిపోయిన ద‌రిమిలా.. ప‌రిశ్ర‌మ‌లు మ‌న‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలోనే కంపెనీలు త‌మ ఉత్ప‌త్తుల‌పై 1-3 శాతం వ‌ర‌కు ధ‌ర‌లు పెంచాయి.

మ‌రోవైపు.. ఆయా దేశాలు అనుస‌రిస్తున్న ప‌న్నుల విధానాల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవి కూడా కంపెనీలకు ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌డం లేద‌న్న‌దివాస్త‌వం. అందుకే.. ఖ‌ర్చులు త‌గ్గించుకునేందుకు కంపెనీలు ముందుకు వ‌స్తున్నాయి. ఈ ప్ర‌ణాళిక‌ల్లో భాగంగానే ఉద్యోఆల‌కు కోత విధిస్తున్నాయి. అయితే.. అంతిమంగా.. ఉద్యోగులు మాత్రం తీవ్ర ఇర‌కాటంలో ప‌డుతున్నారు. ప్ర‌తిష్టాత్మ‌క కంపెనీల్లోఉద్యోగాలు పొంద‌డంతో భారీగా అప్పులు చేసి కార్లు, విల్లాలు కొనుగోలు చేసిన వారి ప‌రిస్థితి ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో ప‌డింది. ప్ర‌పంచ నివేదిక‌ల అంచ‌నా ప్ర‌కారం.. వ‌చ్చే రెండేళ్ల‌లో మ‌రింత తీవ్ర‌మైన ప‌రిస్థితి ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

This post was last modified on September 8, 2026 12:43 pm

Share

Recent Posts

బుల్లితెరపైనే కాదు… వెండితెరపైనా సంచలనమే

ఇండియాలో ఓటీటీల హవా మొదలయ్యాక పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న వెబ్ సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. ఇండియాలో…

4 hours ago

జీవితంలో ఈటీవీ చూడ‌ననుకున్న విజ‌య్…

తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన టీవీ ఛానెళ్ల‌లో ఈటీవీ ఒక‌టి. 90వ ద‌శ‌కంలో ప్రైవేటు టీవీ ఛానెళ్ల జోరు పెరుగుతున్న…

4 hours ago

హై హై నాయకా… అది ఏం నాలుక?

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్, దివంగత నటుడు కోటా శ్రీనివాసరావులు నటించిన ‘హై హై…

4 hours ago

నెగిటివిటీని తట్టుకుంటేనే సత్తా తెలుస్తుంది

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ఫలితం పట్ల దర్శకుడు ఆదిత్య హాసన్ టెన్షన్ పడుతున్న…

5 hours ago

మొదటిసారి పెట్రోల్ కార్లను దాటేసిన CNG, EVలు

భారత్‌లో కొత్త కార్లు కొనేవాళ్లలో ఊహించని మార్పు కనిపిస్తోంది. ఆగస్టులో పెట్రోల్ కార్ల కంటే CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు…

5 hours ago

యష్ చేసిన పొరపాట్లే తప్పులుగా మారాయా

థియేటర్ల దగ్గర టాక్సిక్ కథ ముగిసిపోయింది కానీ దాని కథలు మాత్రం ఆగడం లేదు. తాజాగా సర్దార్ దర్శకుడు మిత్రన్…

7 hours ago