Movie News

నైంటీస్ వరల్డ్… పెద్ద స్కెచ్చే

స్టార్లు లేకుండా.. పెద్ద ఖర్చేమీ లేకుండా.. పరిమిత వనరులతో ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ వెబ్ సిరీస్‌ను రూపొందించాడు ఆదిత్య హాసన్. అది తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని తెలుగులో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్‌గా పేరు తెచ్చుకుంది. ఈటీవీ విన్ అనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ను నిలబెట్టిన సిరీస్‌గానూ దాన్ని చెప్పొచ్చు. ఈ సిరీస్‌తో వచ్చిన పేరుతో ఆదిత్య ‘లిటిల్ హార్ట్స్’ సినిమాను ప్రొడ్యూస్ చేస్తే అది ఇంకా పెద్ద హిట్టయింది. ఇప్పుడు ‘ఎపిక్’ మూవీతో రాబోతున్నాడు ఆదిత్య. 

ఈ చిత్రానికి.. ‘నైంటీస్ మిడిల్‌‌క్లాస్’ సిరీస్‌కు సంబంధం ఉండడం విశేషం. అందులో శివాజీ చిన్న కొడుకు పాత్ర పెద్దవాడై ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్నదే ఈ స్టోరీ. ‘నైంటీస్..’లో తల్లిదండ్రులుగా నటించిన శివాజీ, వాసుకి  ఈ సినిమాలో అదే పాత్రలు చేస్తుండడం విశేషం. 

ఈ చిత్రానికి ‘ఫస్ట్ సెమిస్టర్’ అని క్యాప్షన్ జోడించిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి ఇదొక ఫ్రాంఛైజీగా మారబోతోందని.. మరిన్ని సెమిస్టర్లు వస్తాయని అర్థమవుతోంది. దీని గురించి ఆదిత్య హాసన్‌ను అడిగితే.. ఆల్రెడ ‘ఎపిక్’లో రెండో సెమిస్టర్ షూటింగ్ కూడా మొదలుపెట్టేశామని.. ఈ కథను రెండు భాగాలుగా తీయాలని ముందే అనుకున్నామని చెప్పాడు.

ఇక ‘నైంటీస్ మిడిల్‌క్లాస్’ ప్రపంచంలో ఇంకా సినిమాలు, సిరీస్‌లు వస్తాయని కూడా ఆదిత్య వెల్లడించాడు. ఈ సిరీస్‌లో అన్న పాత్రతో ‘లిటిల్ హార్ట్స్’ తీశామని.. తమ్ముడి పాత్రతో ‘ఎపిక్’ వస్తోందని.. అలాగే అక్క పాత్రతోనూ ఒక సినిమా ఉంటుందని ఆదిత్య చెప్పాడు. 

‘ఎపిక్’ కథ 2017-18 నేపథ్యంలో నడుస్తుందని.. అంతకుముందు ‘నైంటీస్’ ప్రధాన పాత్రధారుల జీవితాల్లో ఏం జరిగిందనే విషయాలతో నైంటీస్ మిడిల్ క్లాస్ సీజన్-2, సీజన్-3 వస్తాయని ఆదిత్య తెలిపాడు. మొత్తంగా చూస్తే.. ‘నైంటీస్’ ప్రపంచం చాలా పెద్దదే అని.. ఆదిత్య హాసన్ ప్రయాణం చాలా ఏళ్ల పాటు ఈ ప్రపంచంతోనే కొనసాగబోతోందని అర్థమవుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా సితార సంస్థ నిర్మించిన ‘ఎపిక్’ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందు రోజు రాత్రే ఈ చిత్రానికి పెయిడ్ ప్రిమియర్స్ పడబోతున్నాయి.

This post was last modified on September 9, 2026 3:34 pm

Share

Recent Posts

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

2 hours ago

డబ్బింగ్ సినిమాల రేట్ల పెంపు సబబేనా

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…

3 hours ago

మార్చాల్సింది జ్ఞానేష్‌నా.. వ్య‌వ‌స్థ‌నా?!

ఒక ఇంట్లో దొంగ ప‌డ్డాడు. న‌గ‌లు, నట్రా దోచుకున్నాడు. య‌జ‌మాని ... ఆ దొంగ‌ను గుర్తించాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.…

4 hours ago

బుమ్రా, పాండ్యా లేకుంటే అంతేనా…

టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…

5 hours ago

గ్రీన్‌కార్డ్ షాక్… ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి?

అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…

5 hours ago

తిరుమ‌ల కేంద్రంగా సాయిరెడ్డి విన్యాసాలు స‌క్సెస్ అయ్యేనా?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డి చేస్తున్న రాజ‌కీయాల‌పై ఆస‌క్తికర…

10 hours ago