Trends

మొదటిసారి పెట్రోల్ కార్లను దాటేసిన CNG, EVలు

భారత్‌లో కొత్త కార్లు కొనేవాళ్లలో ఊహించని మార్పు కనిపిస్తోంది. ఆగస్టులో పెట్రోల్ కార్ల కంటే CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు కలిపి ఎక్కువగా అమ్ముడయ్యాయి. FADA డేటా ప్రకారం దేశంలో ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలలో ప్రత్యామ్నాయ ఫ్యూయల్ కార్లు పెట్రోల్ కార్లను దాటడం ఇదే తొలిసారి.

ఆగస్టు అమ్మకాలలో CNG/LPG కార్ల వాటా 25.28 శాతం ఉండగా, హైబ్రిడ్స్ 9.04 శాతం, EVలు 7.63 శాతం వాటా సాధించాయి. ఈ మూడు కేటగిరీలను కలిపితే మొత్తం వాటా 41.95 శాతానికి చేరింది. పెట్రోల్ కార్ల వాటా 40.85 శాతంగా నమోదైంది. అయితే ఒక్క కేటగిరీగా చూస్తే ఇప్పటికీ పెట్రోల్ కార్లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.

ఈ మార్పు ఒక్క నెలలో వచ్చినది కాదు. గత ఏడాది ఆగస్టులో ప్రత్యామ్నాయ ఫ్యూయల్ కార్ల కంటే పెట్రోల్ కార్లకు దాదాపు 12 శాతం పాయింట్ల ఆధిక్యం ఉండేది. జూలై 2026లో CNG, హైబ్రిడ్, EVలు కలిపి 40.59 శాతానికి చేరగా, పెట్రోల్ కార్లు 41.68 శాతంతో స్వల్పంగా ముందున్నాయి. ఆగస్టులో మాత్రం CNG, హైబ్రిడ్, EVలు కలిపి మొదటిసారి పెట్రోల్‌ను దాటేశాయి.

CNG కార్ల రన్నింగ్ ఖర్చు తక్కువగా ఉండటం, EVల్లో రేంజ్ పెరగడం, ఛార్జింగ్ సదుపాయాలు మెరుగవడం, హైబ్రిడ్ మోడల్స్ ఎక్కువ కావడం ఈ మార్పుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. E20 పెట్రోల్‌పై కొంతమంది వినియోగదారుల్లో ఉన్న సందేహాలు కూడా ప్రత్యామ్నాయ ఫ్యూయల్ కార్ల వైపు వెళ్లేందుకు కారణమవుతున్నాయని FADA చెబుతోంది. ఆగస్టులో మొత్తం 4.02 లక్షల ప్యాసింజర్ వెహికల్స్ రిటైల్ కాగా, గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 16 శాతానికి పైగా పెరిగాయి.

This post was last modified on September 8, 2026 12:19 pm

Share

Recent Posts

అంబటి కన్ను హోం మంత్రి సీటుపై పడిందా

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నోటి…

1 hour ago

ప్యారడైజ్ కోసం కాచుకుని ఉన్నారు

అనుకున్నట్టే ప్యారడైజ్ ఓటిటి రిలీజ్ సరిగ్గా నాలుగు వారాలకు వచ్చేస్తోంది. ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు నెట్…

3 hours ago

ఇప్పుడు పార్టీ ప్రమోషన్ ఎందుకు సాయిరెడ్డి గారు

ఏపీలో కొత్త పార్టీకి శ్రీకారం చుడుతున్నాన‌ని చెబుతున్న మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నాయ‌కుడు వి. విజ‌య‌సాయిరెడ్డి తాజాగా మ‌రో…

4 hours ago

అయ్య‌న్న ఇలాకాలో తోడికోడ‌ళ్ల ఫైటింగ్‌

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్.. టీడీపీ సీనియ‌ర్ నేత చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు కుటుంబానికి మ‌రో కీల‌క ప‌ద‌వి చిక్కింది. ఇప్ప‌టికే…

4 hours ago

బెజవాడ బరిలో ఏబీవీ ఎవరి ఓట్లు చీల్చుతారు?

రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేదు. వైసీపీ హయాంలో సస్పెన్షన్ కు…

5 hours ago

డైరెక్టర్‌ది నా కులమే… అందుకే కథ చెప్పా

తన బుర్రకథ, పాటలతో 80, 90 దశకాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఒక ఊపు ఊపేసిన కళాకారిణి గరివిడి లక్ష్మి. ఆ…

6 hours ago