థియేటర్ల దగ్గర టాక్సిక్ కథ ముగిసిపోయింది కానీ దాని కథలు మాత్రం ఆగడం లేదు. తాజాగా సర్దార్ దర్శకుడు మిత్రన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు మరోసారి అభిమానుల్లో చర్చకు దారి తీస్తున్నాయి. గతంలో యష్ కు తాను ఇండియానా జోన్స్ తరహా ఒక అద్భుతమైన సబ్జెక్టు చెప్పానని, కానీ ఆయన బిజీగా ఉండటం వల్ల కార్యరూపం దాల్చలేదని చెప్పుకొచ్చారు. అంటే వారణాసి తరహా బ్యాక్ డ్రాప్ తో ఈ కలయికలో ఒక ప్రాజెక్టు డిస్కషన్ లోకి వచ్చిందన్న మాట.
కట్ చేస్తే దాన్ని వదులుకుని టాక్సిక్ చేయడం యష్ ని చాలా పెద్ద మూల్యం చెల్లించేలా చేసింది. ఇదొక్కటే కాదు యష్ చేసిన పొరపాట్లు చివరికి తప్పులుగా మిగిలిపోయాయి. వాటిలో మరొకటి ఇంగ్లీష్ వెర్షన్ సమాంతరంగా షూట్ చేయడం. అంత ఖర్చు పెట్టి కన్నడతో పాటు ఆంగ్లంలోనూ డబుల్ షూట్ చేయడం వల్ల చాలా వ్యయ ప్రయాసలయ్యాయి. ఇంతా చేసి ఇంగ్లీష్ వెర్షన్ దారుణంగా పోయింది. ఓవర్సీస్ లోనూ జనం పట్టించుకోనంత దారుణంగా ఫెయిలయ్యింది.
మరొకటి ఓటిటి డీల్. షూటింగ్ జరుగుతున్నప్పుడు వచ్చిన భారీ మొత్తాన్ని వద్దనుకుని ఇంకా ఎక్కువ కావాలనుకుని డ్రాప్ కావడం పరిస్థితి ఇంకా కిందకు తీసుకెళ్లిందనే ప్రచారం కొద్దిరోజులుగా జరుగుతూనే ఉంది. ముందు ఆఫర్ చేసిన మొత్తానికి ఇప్పుడు చెబుతున్న నెంబర్ కి దాదాపు డెబ్భై శాతం వ్యత్యాసం ఉందట. థియేటర్ రిలీజ్ కు ముందే ఓకే చెప్పి ఉంటే రికవరీ భారీగా పెరిగేదని, కంటెంట్ మీద అతి నమ్మకంతో హీరో, నిర్మాత ఇద్దరూ రాంగ్ స్టెప్ వేశారని వినికిడి.
ప్రస్తుతం యష్ బ్రేక్ లో ఉన్నాడు. ఎవరితో చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. నవంబర్ లో రామాయణ రిలీజ్ ఉంది. దాని ప్రమోషన్ల కోసం ఈ నెలాఖరు నుంచి అందుబాటులోకి రావాలని నిర్మాత నమిత్ మల్హోత్రా కబురు పెట్టారని టాక్. వీలైనంత వరకు టాక్సిక్ ప్రస్తావన రాకుండా యష్ జాగ్రత్తలు తీసుకునేలా ఉన్నాడు. ఇదంతా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ తో తన స్టామినా చాటిన యష్ ఈసారి మాత్రం మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా రైట్ ఛాయస్ ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరిక.
This post was last modified on September 8, 2026 6:34 pm
ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…
ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…
కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…
సైబర్ నేరాల గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు సహా రిజర్వ్ బ్యాంకు…
చాలా ఏళ్ల నుంచి తమిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒకడు. సూపర్ స్టార్ రజినీకాంత్, దళపతి విజయ్ తర్వాత…
తెలంగాణలో కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల…