Movie News

నెగిటివిటీని తట్టుకుంటేనే సత్తా తెలుస్తుంది

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ఫలితం పట్ల దర్శకుడు ఆదిత్య హాసన్ టెన్షన్ పడుతున్న వైనం తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బయట పడింది. ఇది సహజం. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి, 90స్ మిడిల్ క్లాస్ తీసిన తర్వాత వచ్చిన మంచి పేరు ఆధారంగా చేసుకుని ఎపిక్ లో ఏదేదో ఊహించుకున్న ఆడియన్స్ కు అందులో కొంచెం బోల్డ్ కంటెంట్ కనిపించేసరికి సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి ఖంగారు పడాల్సిన పని లేదు.

ఎందుకంటే ఆదిత్య హాసన్ చెప్పిన సందీప్ రెడ్డి వంగ ఉదాహరణే తీసుకుంటే అర్జున్ రెడ్డి పోస్టర్ మీదే అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. కొన్ని సంఘాల వాళ్ళు వాటి మీద నిరసన కూడా వ్యక్తం చేశారు. కానీ అవేవి సినిమా విజయాన్ని ఆపలేకపోయాయి. బ్లాక్ బస్టర్ సాధించింది. ఎపిక్ ఆ స్థాయికి వెళ్తుందా లేదానేది కాదు ఇక్కడ ప్రశ్న. జనాలు ఏమనుకుంటారో అని టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే రిలీజ్ రోజు ఫైనల్ గా మాట్లాడాల్సింది కంటెంటే. అది ఉంటే ఎవరూ సక్సెస్ ని ఆపలేరు.

అయితే నిర్మాత నాగవంశీ కూడా ట్రైలర్, క్లైమాక్స్, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం చూస్తే ముందే ప్రిపేర్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఎంత న్యూ ఏజ్ లవ్ డ్రామా అయినా తెలుగు ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా ఉంటేనే హిట్టు దక్కుతుంది. ముగింపు ఎలా ఉన్నా,. రొమాన్స్ ఎంత పెట్టినా పాస్ అవ్వొచ్చు. ఆదిత్య హాసన్ కున్న బ్రాండ్ వల్ల ఇప్పుడొచ్చిన సెన్సార్ ఏ సర్టిఫికెట్ చర్చగా మారింది కానీ లేదంటే ఈ డిస్కషన్ ఉండేది కాదేమో.

పెద్ది నుంచి ఇరుముడి దాకా దాదాపు అన్ని సినిమాలు మాస్, ఫ్యామిలీస్ ని ఎక్కువగా టార్గెట్ చేసుకుని వచ్చి ఘనవిజయాలు అందుకున్నాయి. ప్రత్యేకంగా యువతను లక్ష్యంగా పెట్టుకున్న ఎపిక్ కనక వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఉండి, జెన్ జీ బ్యాచ్ కు కనెక్ట్ అయితే మటుకు రిజల్ట్ గురించి టెన్షన్ పడాల్సిన పని ఉండదు. ఆ మాటకొస్తే నెగటివిటీ ఉండటం కూడా ఒకరకంగా మంచిదే. ఏంన్దరో లెజెండరీ ఫిలిం మేకర్స్ కూడా దీన్ని అనుభవించిన వాళ్లే. 

This post was last modified on September 8, 2026 10:16 pm

Share

Recent Posts

సోమిరెడ్డి ఇలాకాలో నువ్వా – నేనా

నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైసీపీల మధ్య తీవ్ర రాజకీయ పోటీ నడుస్తోంది. ప్రస్తుత…

3 hours ago

70 వయసులో అదిరిపోతున్న ‘చిరు’ ప్లానింగ్

ఇప్పటి స్టార్ హీరోల కెరీర్లు చూస్తున్నాం. జీవిత కాలంలో మహా అయితే ఇరవై నుంచి నలభై సినిమాలు చేస్తే గొప్పనేలా…

6 hours ago

ఇరుముడి వేట అయిపోలేదు స్వామి

ప్యారడైజ్ వచ్చేసింది కాబట్టి వేరే ఏ సినిమాలకు జనాలు లేరనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓటిటిలో వచ్చాక కూడా ఇరుముడి ఇంకా…

9 hours ago

బాలయ్య మనసు మారితే బాక్సాఫీస్ యుద్ధమే

డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…

10 hours ago

రణబాలి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త

సోషల్ మీడియా రాను రాను మరీ తీవ్రంగా మారిపోతోంది. ప్యారడైజ్ బాగుందా లేదానేది పక్కనపెడితే బెనిఫిట్ షో అయిన దగ్గరి…

12 hours ago

RTO ఆఫీసుకు వెళ్లకుండానే LLR… టెస్ట్‌లో AI నిఘా!

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…

14 hours ago