Trends

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’
అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్, మురళీ శర్మల మధ్య జరిగిన ఈ సీన్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే.

అయితే, ఈ సినిమాలో తండ్రి వాల్మీకిని కొడుకు బంటు ఛమ్మక్ చంద్రకు పట్టించిన వైనం నవ్వులు పూయిస్తుంది. అయితే, అలవైకుంఠపురములో బంటు క్యారెక్టర్ ను అనంతపురములోని ఆరేళ్ల మహేష్ బాగా వంటబట్టించుకున్నట్లుంది. అందుకే, కార్డన్ సెర్చ్ లో దొరకకుండా తన తండ్రి దాచిపెట్టిన బైక్ ను పోలీసులకు దగ్గరుండి మరీ చూపించాడు ఆ బుడతడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నెల్లూరు జిల్లా అనంతసాగరంలోని ఓ ఏరియాలో పోలీసులు రెగ్యులర్ కార్డన్ సెర్చ్‌ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి ఇంట్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అయితే, తన బండికి సంబంధించిన డాక్యుమెంట్లు సరిగా లేని కారణంతో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు సురేష్ అనే వ్యక్తి తన బైక్ ను పక్క వీధిలో దాచిపెట్టారు. పోలీసులను బురిడీ కొట్టించానని ఫుల్ జోష్ లో ఉన్న సురేష్ కు ఆయన కొడుకు మహేంద్ర షాకిచ్చాడు.

‘‘మా డాడీ…బండి బయటపెట్టిండు…ఇంట్లో పెట్టకుండా.. మీరు వస్తున్నారని దాచిపెట్టాడు..అదిగో మా బండి…’’ అంటూ పక్క వీధిలోకి పోలీసులను తీసుకువెళ్లాడు మహేంద్ర. పక్కా ప్లాన్ తో పక్క వీధిలో పార్క్ చేసిన బైక్ ను తన కొడుకే పట్టించడంతో సురేష్ షాక్ లో ఉండిపోయాడు. తన కొడుకు అడ్డంగా బుక్ చేయడంతో చేసేదేమీ లేక పోలీసుల ముందు తెల్లమొహమేశాడు.

అయితే, ఈ మొత్తం సీన్ లో పోలీసులు ఆ బుడ్డోడి మాటలను సరదాగా తీసుకొని నవ్వుకుంటూ వెళ్లారు. మరి, తండ్రిని పట్టించిన తనయుడి మాటలకు ఫిదా అయిపోయి తండ్రికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారా…లేదా అన్న సంగతి తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా బంటు మాదిరి వాళ్ల నాన్నను ఇరకాటంలో పడేసిన మహేంద్రను చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

This post was last modified on August 21, 2026 7:20 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

2 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

4 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

5 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

5 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

5 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

5 hours ago