ఇప్పటికీ సచినే నెంబర్ వన్

సచిన్ అంటే ఒక బ్రాండ్. అందుకే ఆయన బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదు. దేశంలోని ప్రముఖ కంపెనీలు ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకునేందుకు పోటీ పడుతున్నారు. క్రికెట్ కు గుడ్ బై చెప్పి 13 ఏళ్ళు దాటినప్పటికి దేశంలోని టాప్ టెన్ సెలబ్రిటీల్లో సచిన్ నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. పిచ్ మీద ఆడుతున్న క్రీడాకారులతో పోటీ పడుతున్నాడు.

జాతీయ, అంతర్జాతీయ క్రికెట్లో అనేక రికార్డులు సృష్టించి క్రికెట్ దేవుడిగా పేరొందిన ఈ 53 ఏళ్ళ క్రికెట్ దిగ్గజం 2013లో క్రీడా మైదానాన్ని ఒదిలిపెట్టాడు. అయినా సరే రిటైర్డ్మెంట్ ప్రకటించిన క్రీడాకారుల్లో అత్యధిక బ్రాండ్ విలువతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. క్రీడా మైదానంలో కనిపించక పోయినా వాణిజ్య ప్రకటనల్లో నిత్యం పలకరిస్తూనే వున్నాడు.

తాజాగా క్రోల్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వ్యాల్యూయేషన్ -2025 నివేదికను ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం విరాట్ కోహ్లీ, ధోని కంటే బ్రాండ్ వ్యాల్యూయెషన్లో సచిన్ ముందున్నాడు. సచిన్ విలువ 1200 కోట్ల రూపాయలు వున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. క్రికెట్ కు గుడ్ బై చెప్పినప్పటికి భారీగా ఆదాయం అర్జీస్తున్న క్రీడాకారుడిగా రికార్డు సృష్టిస్తున్నారు. 24 ఏళ్ళ పాటు క్రికెట్ లో సంపాదించిన దానికంటే ఇప్పుడే ఎక్కువగా సంపాదిస్తున్నాడని సచిన్ భక్తులు చెబుతున్నారు.

సచిన్ కు ముందు, తర్వాత అనేక మంది క్రీడాకారులు వచ్చారు, పోయారు. పిచ్ మీద ఆడినన్నాళ్ళు జేజేలు అందుకున్నారు. ఎప్పుడైతే రిటర్డ్మెంట్ ప్రకటించారో క్రమంగా కనుమరుగయ్యారు. కానీ సచిన్ చరిష్మా మాత్రం దశాబ్దం దాటినా తగ్గలేదు. క్రీడా మైదానంలో ఆయన రికార్థులను కోళ్లగొడుతున్నారు కానీ అభిమానుల గుండెల్లో ఆయన స్థానాన్ని భర్తీ చేయలేకపోతున్నారు. అందుకే సచిన్ పేరు వినగానే ఇప్పటికీ క్రికెట్ గుర్తుకు వస్తుంది. సచిన్ ఇప్పటికీ ఒక బ్రాండ్…