న్యాచురల్ స్టార్ నాని అభిమానుల విపరీతమైన ఎదురు చూపులకు చెక్ పెడుతూ ది ప్యారడైజ్ టీజర్ వచ్చేసింది. నిమిషంన్నర లోపే వీడియో ఉన్నప్పటికీ సినిమాలో ఎంత వయొలెన్స్ ఉందో చాలా శాంపిల్స్ ఇచ్చారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ముందు నుంచి ఈ మూవీని అదే కోణంలో ప్రోజెక్ట్ చేస్తూ వచ్చారు. అయితే సోషల్ మీడియాలో అనూహ్యంగా మిశ్రమ స్పందన కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నానికి సాధారణంగా పాజిటివ్ రియాక్షన్లే ఎక్కువగా వస్తుంటాయి.
కానీ ఇప్పుడు దానికి భిన్నంగా పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే నాని స్పష్టంగా లేదనిపించేలా డబ్బింగ్ సరిగ్గా సెట్ కాకపోవడం ఒక కారణమైతే ఫాస్ట్ గా పరిగెడుతున్న విజువల్స్ కు అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మధ్యలో ఎక్కడో చిన్న సింక్ మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. దానికి తోడు మూవీ అంతా నరకడమే ఉంటుందనే రేంజ్ లో టీజర్ ఎడిట్ చేయడం సామాన్య ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ కానివ్వడం లేదు. దాని వల్లే మిక్స్డ్ రియాక్షన్లు.
అంచనాలు విపరీతంగా ఉన్నప్పుడు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ది ట్రైలర్ అచ్చంగా ఇదే సమస్యని ఫేస్ చేసింది. జనాలు మరీ ఎక్కువగా ఊహించేసుకోవడంతో బుచ్చిబాబు వాటిని అందుకోవడంలో తడబడ్డారు. ఫలితంగా దాని ప్రభావం కొంత ఓపెనింగ్స్ మీద పడింది. హిందీలో డ్యామేజ్ కూడా చేసింది. కానీ ప్యారడైజ్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే ట్రైలర్ సమయానికి ఇప్పుడొచ్చిన ఫీడ్ బ్యాక్ ని పరిగణనలోకి తీసుకుని సరిచేయొచ్చు.
సెప్టెంబర్ 24 విడుదల కాబోతున్న ప్యారడైజ్ మీద భారీ పెట్టుబడులు ఉన్నాయి. ఆలస్యం వల్ల నిర్మాత ఇప్పటికే పెను భారాన్ని మోస్తుండగా బయ్యర్లు నాని కెరీర్ లోనే అత్యధిక అమౌంట్లతో హక్కులు కొంటున్నారు. ఇంత నమ్మకాన్ని నిలబెట్టాలన్నా, ప్రమోషన్ల విషయంలో ఎలాంటి పొరపాటు జరగకూడదన్నా ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. యునానిమస్ అనిపించే రేంజ్ లో ప్రతి పబ్లిసిటీ ఉండాలి. శ్రీకాంత్ ఓదెలకు ఆల్రెడీ ఫ్యాన్స్ నుంచి ఫీడ్ బ్యాక్ వెళ్లిందట.
Gulte Telugu Telugu Political and Movie News Updates