చైనా.. ఈ పేరు వినగానే వెంటనే గుర్తుకు వచ్చేది కరోనా! ప్రపంచాన్ని గడగడలాడించి లక్షల సంఖ్యలో ప్రజలను మృత్యువాతపడేసి.. బంధాలు, బంధుత్వాలను కూడా శాశ్వతంగా చెరపేసిన కంటికి కనిపించ ని శత్రువు పుట్టిన దేశంగా చైనా ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోయింది. అమెరికా అంచనా మేరకు కరోనా వ్యాపించని దేశం అంటూ.. ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. సో.. చైనా పేరు చెప్పగానే కరోనా కంట్రీ
అనే మాట వినిపిస్తోంది. ఇక, ఇది మొన్నటి మాట. గడిచిన నెలరోజులుగా కరోనా వైరస్ కొంతమేరకు బలపడి స్ట్రెయిన్‌గా ప్రపంచ దేశాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది.
బ్రిటన్‌లో స్ట్రెయిన్ ధాటికి మరోసారి లాక్‌డౌన్ విధించే పరిస్థితి వచ్చింది. తాజాగా ఈ స్ట్రెయిన్ మన దేశం లోనూ విస్తరించింది. ఇప్పటికి కరోనా కేసులు అంతో ఇంతో తగ్గుముఖం పడుతున్నాయనుకుంటున్న క్రమంలో.. భారత్‌లోనూ స్ట్రెయిన్ కేసులు ఇప్పటి వరకు 90 దాటినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. మరోవైపు కరోనా వ్యాక్సిన్ విషయంలో కొంత మేరకు పురోగతి కనిపించడం, ఈ నెల 16 నుంచి భారీ ఎత్తున వ్యాక్సిన్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో కరోనాపై కొంత ఆవేదన, ఆందోళన తగ్గినా.. స్ట్రెయిన్ భయపెడుతోంది. అంటే.. చైనా పోయింది.. ఇప్పుడు దాని ప్లేస్‌లో బ్రిటన్ చేరింది.
ఇక, ఈ రెండు దేశాల పరిస్థితి ఇలా ఉంటే.. ఇప్పుడు అమెరికా కూడా కరోనా రూపాంతర దశకు చెందిన వైరస్‌తో అల్లాడిపోతోంది.పైగా ఇది స్ట్రెయిన్ తర్వాత దశగా అగ్రరాజ్యం వైట్ హౌస్ టాస్క్ ఫోర్సు వెల్లడిం చడం గమనార్హం. అంతేకాదు, తాజాగా వెలుగు చూసిన యూఎస్ – వైరస్.. స్ట్రెయిన్ కన్నా 50 శాతం ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుందని, పరివర్తిస్తుందనిపేర్కొనడం మరింత ఆవేదనకు గురిచేస్తోంది. ఈ వైరస్ ధాటికి రోజుకు 3 వేల పైచిలుకు జనాభా మృత్యువాత పడడం గమనార్హం. దీంతో నాడు చైనా.. తర్వాత బ్రిటన్.. ఇప్పుడు అమెరికా వంతు వచ్చిందా.. ఈ ప్రపంచాన్ని ముంచేయడానికి అనే కామెంట్లు సోషల్ మిడియాలో వెల్లువెత్తుతుండడం గమనార్హం.
This post was last modified on January 10, 2021 10:17 am
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…