ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇండియా ఎప్పుడూ ఆడింది లేకపోయినా, ఈ సారి కూడా పోటీలో లేకున్నా.. ఆ టోర్నీ మీద మన వాళ్లకున్న ఆసక్తి తక్కువేమీ కాదు. నిన్న దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ అర్ధరాత్రి ఎక్కడ చూసినా ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ సందడే కనిపించింది. ఐతే మన జట్టు లేని టోర్నీలో ఎక్కువమంది కోరుకున్నది అర్జెంటీనా విజయాన్నే. ఎందుకంటే అది లియోనల్ మెస్సి జట్టు. అతను ఇండియన్ ఫుట్‌బాల్ లవర్స్‌కు ఎంతో ఇష్టమైన ఆటగాడు.
గత ఏడాది ఇండియాలో పర్యటించినపుడే తనకు ఇక్కడున్న క్రేజ్ ఎలాంటిదో అర్థమైంది. నాలుగేళ్ల కిందట అతను తొలిసారి ప్రపంచకప్‌ను అందుకున్నాడు. ఇప్పుడు ఇంకో కప్పుతో ఘనంగా కెరీర్‌కు వీడ్కోలు పలుకుతాడని ఆశించారు ఫ్యాన్స్. కానీ స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓటమితో వాళ్లందరికీ తీవ్ర నిరాశ తప్పలేదు. ఇక అర్జెంటీనా అభిమానుల పరిస్థితి అయితే చెప్పాల్సిన పని లేదు. ఫుట్‌బాల్‌ను పిచ్చిగా ప్రేమించే దేశంలో ఇప్పుడు విషాదం నెలకొంది.
ఐతే నిన్న రాత్రి ఫైనల్ చూసిన వాళ్లకు అర్జెంటీనా కప్పు గెలవాల్సిన జట్టు కాదు.. స్పెయిన్‌కే ఆ అర్హత ఉందని కచ్చితంగా అర్థమవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ మీద ఆ ఐరోపా జట్టు ఆ స్థాయిలో ఆధిపత్యం చలాయించింది. అదనపు సమయంతో కలిపి మొత్తం 120 నిమిషాల ఆటలో బంతి పూర్తిగా స్పెయిన్ అధీనంలోనే ఉంది. ఆ జట్టు డజనుసార్లు అర్జెంటీనా గోల్ పోస్టు మీద దాడి చేసింది. కానీ అర్జెంటీనా ఒక్కటంటే ఒక్కసారి కూడా స్పెయిన్ గోల్ పోస్టు మీద ఎటాక్ చేయలేకపోయింది.
మెస్సి సహా ఏ అర్జెంటీనా స్టార్‌కూ బంతి దొరకనివ్వకుండా అద్భుతమైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్న స్పెయిన్.. ఎటాక్‌లోనూ తనకు తిరుగులేదని చాటింది. పూర్తిగా మ్యాచ్‌ను ఏకపక్షం చేసిన ఆ జట్టు 106వ నిమిషంలో టోరెస్ గోల్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకుింది. అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెజ్ అద్భుత పనితనం పుణ్యమా అని మ్యాచ్ అదనపు సమయం వరకు వెళ్లింది కానీ.. స్పెయిన్ ఆడిన తీరుకు ఆ జట్టు నిర్ణీత సమయంలోనే, ఇంకా ఘనంగా మ్యాచ్ గెలవాల్సింది. అర్జెంటీనా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయిన ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనందుకు ఆ జట్టు అభిమానులు ఎక్కువ ఫీలవ్వాల్సిన పని లేదు. ఇక మెస్సి కెరీర్‌కు ఇలాంటి ముగింపు బాధాకరమే అయినా.. ఆల్రెడీ అతను ఒక ప్రపంచకప్ సాధించాడు కాబట్టి మరో ఫైనల్ ఆడాడన్న సంతృప్తితో నిష్క్రమించాల్సిందే.
Estimated reading time: 2 minutes
This post was last modified on July 20, 2026 9:29 pm
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…