Trends

ఇంకెంతమంది లెఫ్ట్ హ్యాండర్స్… పటిదార్ కనిపించట్లేదా?

జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో మొదలుపెడితే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్ లాంటి వాళ్లతో స్క్వాడ్ మొత్తం లెఫ్ట్ హ్యాండర్స్ తోనే నిండిపోయింది. టాప్ ఆర్డర్ మొదలుకుని లోయర్ ఆర్డర్ దాకా ఒకే రకమైన బ్యాటర్లను నింపడం వెనుక సెలెక్టర్ల వ్యూహం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.

అయితే ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ ఆధారంగానే ఎంపిక చేశారని సమర్థించుకుందాం అనుకుంటే, రైట్ హ్యాండ్ బ్యాటర్లలో అద్భుతంగా రాణిస్తున్న రజత్ పటిదార్‌ను ఎందుకు విస్మరించారనే దానికి మాత్రం మేనేజ్‌మెంట్ దగ్గర సమాధానం దొరకడం లేదు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో రజత్ కు ఉన్న టెక్నిక్ చాలా అద్భుతం. దేశవాళీ టోర్నీల్లో, ఐపీఎల్ లో ఎన్నో కీలక మ్యాచ్ లలో ఒత్తిడిని జయించి ఒంటిచేత్తో మ్యాచ్ లు గెలిపించిన సత్తా ఉంది. అలాంటి క్లాస్ ప్లేయర్ కు కనీసం జింబాబ్వే లాంటి సిరీస్ లో అవకాశం ఇవ్వకపోవడం తీవ్ర అన్యాయం అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఇక మరోవైపు కెప్టెన్ గా ఏకంగా రెండు ఐపీఎల్ ట్రోఫీలు గెలిపించిన అపారమైన అనుభవం ఉండి, మిడిల్ ఆర్డర్ లో పర్ఫెక్ట్ గా ఆడుతున్న రైట్ హ్యాండ్ బ్యాటర్ ను కూడా కావాలనే పక్కనపెట్టారనే విమర్శలు గట్టిగా వస్తున్నాయి. ఐపీఎల్ లో తన మార్క్ కెప్టెన్సీతో అదరగొట్టడమే కాకుండా కష్టసమయాల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడుతున్న ఆ బ్యాటర్ కు కూడా సెలెక్టర్లు మొండిచేయి చూపించారు.

ఒకప్పుడు జట్టులో సరైన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దొరకడమే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. ఫామ్ లో ఉన్నా లేకపోయినా కొంతమంది ఆటగాళ్లను ఎందుకు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సంజూ శాంసన్ లాంటి వాళ్లు ఒకటి రెండు మ్యాచ్ లలో ఫెయిల్ అవ్వగానే వెంటనే రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు, రజత్ పటిదార్ లాంటి వాళ్లను కనీసం పరిశీలించకపోవడం పక్షపాతమే అవుతుందనీ మరికొందరు అంటున్నారు.

This post was last modified on July 7, 2026 1:46 pm

Share

Recent Posts

ఆలస్యం ‘ఆదర్శం’ కాకుంటే చాలు

ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…

3 hours ago

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

8 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

10 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

10 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

12 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

13 hours ago