బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్‌లో కొనసాగుతున్న హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. తెలుగులో ‘1 నేనొక్కడినే’, ‘దోచేయ్’ లాంటి ఫ్లాప్ సినిమాల్లో నటించినా.. హిందీలో మాత్రం ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది కృతి. ఇటీవలే ‘కాక్ టైల్-2’లో రష్మికతో కలిసి నటించిన విషయం తెలిసిందే. గత ఏడాది ‘తేరే ఇష్క్ మే’ చిత్రంతోనూ ఘనవిజయాన్ని ఖాతాలో వేసుకుంది.
బాలీవుడ్ స్టైల్‌కు తగ్గట్లు గ్లామర్‌తో ఆకట్టుకుంటూనే పెర్ఫామెన్స్‌తోనూ మెప్పించే అరుదైన కథానాయికల్లో కృతి ఒకరు. ఆమెకు ఇప్పటికే 35 ఏళ్లు వచ్చేశాయి. కానీ కెరీర్ గొప్పగా సాగుతోంది. దీంతో పెళ్లి వైపు ఇంకా ఆలోచనలు మళ్లలేదు. కబీర్ బహియా అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పటికీ.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నట్లు ఆమెకు కనిపించడం లేదు. కానీ చాలా ఏళ్ల కిందటే పిల్లల కోసం ఆమె ప్లానింగ్ చేసేసిందట.
కృతి కెరీర్లో చాలా ప్రత్యేకమైన చిత్రాల్లో ఒకటైన ‘మిమి’లో నటిస్తున్న సమయంలోనే ఆమె భవిష్యత్తుల్లో పిల్లలు కనడంలో ఏ ఇబ్బంది రాకుండా ఉండేందుకు తన అండాలను దాచి పెట్టిందట. ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది కృతి.
మిమి సినిమాలో సరోగేట్ మదర్‌గా ప్రెగ్నెంట్ రోల్ చేయడం కోసం 15 కిలోల బరువు పెరిగింది కృతి. పాత్ర కోసం అలా బరువు పెరగమని ‘మిమి’ మేకర్స్ చెప్పినపుడే తనకు అండాలు దాచిపెట్టాలన్న ఆలోచన వచ్చిందని ఆమె తెలిపింది. భవిష్యత్తులో వయసు ఎక్కువై, ఇంకా ఏవైనా సమస్యలు తలెత్తి పిల్లల్ని కనడంలో ఇబ్బందులు రాకూడదన్న ఉద్దేశంతో తన అండాలను దాచే ప్రక్రియలో భాగమైనట్లు కృతి వెల్లడించింది.
‘‘అవును. నేను నా అండాలను దాచిపెట్టాను. ఫలానా సమయంలో పెళ్లి చేసుకోవాలి, ఫలానా వయసులో పిల్లల్ని కనాలి అంటూ ఒక టైమ్ లైన్ నిర్దేశించుకునే అవసరం లేకుండా.. వయసు పెరిగాక ఎదురయ్యే సమస్యలతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆ పని చేశాను. పెళ్లి అయినా, పిల్లలైనా మన మనసుకు అనిపిస్తేనే ముందడుగు వేయాలి.
టైంను బట్టి, ఎవరి ఒత్తిడితోనో ఆ నిర్ణయాలు తీసుకోకూడదు. అందుకే అండాలు దాచిపెట్టాను. ఇది అందరికీ సాధ్యమయ్యే ప్రక్రియ కాదు. నా వల్ల అయింది కాబట్టి నేను చేసుకోగలిగాను. ఇది చాలా మంచి నిర్ణయమని, నీకు నువ్వు ఇచ్చుకునే పెద్ద గిఫ్ట్ అని ఒక వ్యక్తి చెప్పారు. అండాలు దాచిపెట్టడం అన్నది చిన్న విషయం కాదు. అది ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా మనపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇదంత తేలికైన ప్రక్రియ కాదు’’ అని కృతి చెప్పింది.
This post was last modified on July 7, 2026 1:01 pm
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘జైలర్-2’కు విడుదల ముంగిట పెద్దగా హైప్ ఏమీ కనిపించలేదు. ఆ సినిమా ప్రోమోలు…
రప్పా రప్పా రాజకీయాలు మనకు వద్దని, రాష్ట్రాన్ని భయం నీడలో బతికే పరిస్థితికి తిరిగి తీసుకురావొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు…
ప్రతి స్టార్ హీరోకూ ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఫిలిం ఇండస్ట్రీలోనే కాక వివిధ రంగాల ప్రముఖుల్లో కూడా డై హార్ట్…
రెండు రోజుల కిందట ముంబయి వీధుల్లో జనం అంతా చూస్తుండగా.. టైగర్ ష్రాఫ్ లాంటి పేరున్న బాలీవుడ్ నటుడి మీద…
దలేర్ మెహందీ.. ఇండియాలో ఎంతో గొప్ప పేరున్న పంజాబీ సింగర్. తుణుక్ తుణుక్ తున్.. సహా ఎన్నో బ్లాక్ బస్టర్…
నిన్న హైదరాబాద్ లో జరిగిన రామాయణ పార్ట్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాష్ అన్న మాటలు ఇండస్ట్రీ…