జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో మొదలుపెడితే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్ లాంటి వాళ్లతో స్క్వాడ్ మొత్తం లెఫ్ట్ హ్యాండర్స్ తోనే నిండిపోయింది. టాప్ ఆర్డర్ మొదలుకుని లోయర్ ఆర్డర్ దాకా ఒకే రకమైన బ్యాటర్లను నింపడం వెనుక సెలెక్టర్ల వ్యూహం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.
అయితే ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ ఆధారంగానే ఎంపిక చేశారని సమర్థించుకుందాం అనుకుంటే, రైట్ హ్యాండ్ బ్యాటర్లలో అద్భుతంగా రాణిస్తున్న రజత్ పటిదార్‌ను ఎందుకు విస్మరించారనే దానికి మాత్రం మేనేజ్‌మెంట్ దగ్గర సమాధానం దొరకడం లేదు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో రజత్ కు ఉన్న టెక్నిక్ చాలా అద్భుతం. దేశవాళీ టోర్నీల్లో, ఐపీఎల్ లో ఎన్నో కీలక మ్యాచ్ లలో ఒత్తిడిని జయించి ఒంటిచేత్తో మ్యాచ్ లు గెలిపించిన సత్తా ఉంది. అలాంటి క్లాస్ ప్లేయర్ కు కనీసం జింబాబ్వే లాంటి సిరీస్ లో అవకాశం ఇవ్వకపోవడం తీవ్ర అన్యాయం అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఇక మరోవైపు కెప్టెన్ గా ఏకంగా రెండు ఐపీఎల్ ట్రోఫీలు గెలిపించిన అపారమైన అనుభవం ఉండి, మిడిల్ ఆర్డర్ లో పర్ఫెక్ట్ గా ఆడుతున్న రైట్ హ్యాండ్ బ్యాటర్ ను కూడా కావాలనే పక్కనపెట్టారనే విమర్శలు గట్టిగా వస్తున్నాయి. ఐపీఎల్ లో తన మార్క్ కెప్టెన్సీతో అదరగొట్టడమే కాకుండా కష్టసమయాల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడుతున్న ఆ బ్యాటర్ కు కూడా సెలెక్టర్లు మొండిచేయి చూపించారు.
ఒకప్పుడు జట్టులో సరైన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దొరకడమే కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. ఫామ్ లో ఉన్నా లేకపోయినా కొంతమంది ఆటగాళ్లను ఎందుకు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సంజూ శాంసన్ లాంటి వాళ్లు ఒకటి రెండు మ్యాచ్ లలో ఫెయిల్ అవ్వగానే వెంటనే రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు, రజత్ పటిదార్ లాంటి వాళ్లను కనీసం పరిశీలించకపోవడం పక్షపాతమే అవుతుందనీ మరికొందరు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates