Trends

కన్నీటితో రొనాల్డో… వరల్డ్ కప్ లో తీరని కల!

ఫుట్‌బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ క్వార్టర్స్ మ్యాచ్ లో స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఓడిపోవడంతో ఈ దిగ్గజ ఆటగాడి కల చెదిరిపోయింది. మ్యాచ్ కు ముందు జరిగిన ప్రెస్ మీట్ లో ఇదే తన ఆఖరి ప్రపంచకప్ అని చాలా గర్వంగా ప్రకటించిన రొనాల్డో.. మైదానంలో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. ఆట ఆఖరి నిమిషం (91వ) లో స్పెయిన్ ఆటగాడు మిఖేల్ మెరినో కొట్టిన గోల్ తో పోర్చుగల్ ఇంటి దారి పట్టింది. ఈ మ్యాచ్ లో రొనాల్డో బంతిని కేవలం 19 సార్లు మాత్రమే తాకగలిగాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వయసు 41 ఏళ్లకు చేరడంతో ఈ టోర్నీలో రొనాల్డో ఆటతీరుపై ముందే అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోర్చుగల్ కోచ్ రాబర్టో మార్టినెజ్ తొలి మూడు మ్యాచ్ లలో అతడిని కంటిన్యూగా ఆడించడంతో ఆ అలసట మైదానంలో స్పష్టంగా కనిపించింది. బంతి కోసం పరుగెత్తడంలో మునుపటి వేగం లోపించింది. ఉజ్బెకిస్థాన్ పై రెండు గోల్స్ చేసినా, ఒకప్పటి ఆ మ్యాజిక్ మాత్రం ఫ్యాన్స్ కు కనిపించలేదు. పాస్ లు అందుకోవడంలో ఆలస్యం కావడం, సహచరులకు అవకాశాలు సృష్టించలేకపోవడం అతడిని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.

తన ఆరు ప్రపంచకప్ ల ప్రయాణంలో రొనాల్డో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. కానీ నాకౌట్ దశలో అతడి ట్రాక్ రికార్డ్ ఏమాత్రం బాగాలేదు. రౌండ్ ఆఫ్ 32లో క్రొయేషియాపై పెనాల్టీ రూపంలో గోల్ చేసి ఎట్టకేలకు నాకౌట్ గోల్స్ ఖాతా తెరిచాడు. ఆరు ఎడిషన్ల ఆడిన తర్వాత అతడికి ఇదే తొలి నాకౌట్ గోల్. ఆ మ్యాచ్ లో అతడిని తొలిసారి సబ్‌స్టిట్యూట్ చేయగా, బదులుగా వచ్చిన గొంకాలో రామోస్ అద్భుతమైన విన్నింగ్ గోల్ తో జట్టును గెలిపించాడు. దీంతో జట్టులో రొనాల్డో పాత్రపై ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి.

రికార్డుల పరంగా చూస్తే ఆరు వరల్డ్ కప్ టోర్నీలలో గోల్స్ చేసిన ఏకైక ఆటగాడిగా రొనాల్డో చరిత్ర పుటల్లో నిలిచాడు. నాకౌట్ దశలో గోల్ చేసిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డులకెక్కాడు. అయితే అతడు సాధించిన 11 ప్రపంచకప్ గోల్స్ లో కీలకమైన మ్యాచ్ లలో వచ్చినవి చాలా తక్కువ. 2006లో తన తొలి వరల్డ్ కప్ ఆడిన రొనాల్డో, అప్పటి తర్వాత ఏనాడూ తన జట్టును క్వార్టర్ ఫైనల్ దాటించలేకపోయాడు. ప్రపంచవ్యాప్తంగా లీగ్ లలో అదరగొట్టే పోర్చుగల్ ఆటగాళ్లు ఉన్నా, వరల్డ్ కప్ వేదికపై మాత్రం ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు.

ఇలాంటి ఓటములతో రొనాల్డో లాంటి ఒక లెజెండ్ కెరీర్ ను తక్కువ అంచనా వేయలేం. తన సుదీర్ఘ కెరీర్ లో దాదాపు వెయ్యికి పైగా గోల్స్ సాధించి ఫుట్‌బాల్ చరిత్రలోనే ఒక మహాద్భుతంగా నిలిచాడు. తన ట్రేడ్ మార్క్ ఫ్రీ-కిక్స్, కళ్లు చెదిరే డ్రిబ్లింగ్స్ తో ప్రత్యర్థి డిఫెండర్లకు పీడకలలు మిగిల్చాడు. క్లబ్ ఫుట్‌బాల్ లో సాధ్యమైనన్ని అన్ని ట్రోఫీలు గెలుచుకున్నాడు. కానీ కెరీర్ లో ఒకే ఒక్క లోటుగా వరల్డ్ కప్ మిగిలిపోయింది. 

This post was last modified on July 7, 2026 9:50 am

Share

Recent Posts

పవన్ స్థాయికి ఏఐ వాడకం అవసరమా

నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సుజిత్ వదిలిన ఓజి యూనివర్స్ వీడియో మీద మిశ్రమ స్పందన కనిపిస్తోంది.…

59 minutes ago

స్థానిక ఎన్నికలు వాయిదా పడవు

స్థానిక ఎన్నికలు వాయిదా పడాలని గొడ్డలి పార్టీ చేస్తున్న కుట్రలను తిప్పి కొడతామని, ఎన్నికలను వాయిదా వేసే ప్రసక్తే లేదని…

1 hour ago

ముగింపుకు వచ్చిన టాక్సిక్ కథ ?

ఉత్తరాది, కర్ణాటక రాష్ట్రాల సంగతేమో కానీ తెలుగులో టాక్సిక్ కథ దాదాపు ముగింపుకు వచ్చినట్టే. రెండో వారంలోకి అడుగు పెట్టకముందే…

3 hours ago

లింగమార్పిడి తరువాత ఆట తీరు మారింది

మాజీ టీమిండియా క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడిగా జన్మించిన అనయా బంగర్, జెండర్ ట్రాన్సిషన్ తర్వాత మహిళగా తన జీవితాన్ని…

4 hours ago

గజం భూమి 2.7 ల‌క్ష‌లు… మ‌ధ్య‌త‌ర‌గ‌తికి `హైద‌రాబాద్` దూరం!

గజం భూమి వేల‌ల్లో ఉంటేనే సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు లబోదిబోమనే ప‌రిస్థితి నెల‌కొంటుంది. అలాంటిది.. ల‌క్ష‌లు ప‌లికితే .. ఇంకేం…

5 hours ago

రేవంత్ తో కారులో వచ్చి… భట్టితో కారులో వెళ్లి….

ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కట్టకట్టుకొని ఢిల్లో మకాం వేసి వున్నారు. మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత…

5 hours ago