దేశాన్ని కుదిపేసిన పోంజీ కుంభకోణం కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్.. చేసిన పని విమర్శలకు తావిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్.. ప్రజల నుంచి 792 కోట్ల రూపాయలను వసూలు చేసి.. బోర్డు తిప్పేశాడు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. కోట్ల రూపాయల విలువైన ఆస్తుల విషయంలో ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ఈడీ అధికారులు ముందుకు వేయలేక పోయారు. తాజాగా ఓ బుల్లి విమానాన్ని మాత్రమే విక్రయించి.. 3 కోట్ల రూపాయలను పొందారు.
ఈ సొమ్మునే బాధితులకు పంచనున్నట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసింది. ముంబైలో వేల కోట్లరూపాయలు విలువ చేసే సొమ్ములు ఉండగా.. వాటి విషయంలో చర్యలు తీసుకోని ఈడీ.. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో పార్కింగ్ చేసిన బుల్లి విమానాన్ని విక్రయించి 3 కోట్ల రూపాయలను పొందడం, ఈ సొమ్మునే బాధితుల ఖాతాల్ల లోకి జమ చేస్తామని చెప్పడం వంటివాటిపై పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. ఈ సొమ్మును ఎవరికి ఏమేరకు పంచుతారని.. తాము చేసిన ఖర్చులో పది పైసల వంతు కూడా లేదని బాధితులు చెబుతున్నారు.
అమర్‌దీప్ కుమార్ పోంజీ పేరుతో అధిక వడ్డీలు ఆశ చూపి ప్రజల నుంచి సొమ్ములు సేకరించారు. ఆ తర్వాత.. బోర్డు తిప్పేశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో కేసు నమోదైంది. అయితే.. అప్పటికే వసూలు చేసిన 792 కోట్ల సొమ్మును విదేశాలు దాటించారన్నా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఈడీ వాటిపై విచారణ చేస్తోంది. ఇప్పటికేపలు ఆస్తులను స్వాధీనం చేసుకుంది. వీటిలో స్థిరాస్తుల విషయం కోర్టులో ఉండడంతో చర్యలు చేపట్టలేక పోయింది. ఈ క్రమంలోనే చరాస్తిగా ఉన్న అమర్‌దీప్ కుమార్ సొంత విమానాన్ని స్వాధీనం చేసుకుంది.
ఈ విమానాన్ని రెండు రోజుల కిందట ఆన్‌లైన్‌లో వేలం పెట్టగా.. దేశానికే చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్త రూ.3 కోట్లకు దక్కించుకున్నారు. ఈ సొమ్ము ఈడీ ఖాతాకు జమైనట్టు అధికారులు తెలిపారు. దీనిని బాధితులకు తలా కొంచెం పంచుతామని చెప్పడం గమనార్హం. కానీ, కోట్ల రూపాయల్లో బకాయిలు ఉన్న నేపథ్యంలో ఈ 3 కోట్లను ఎవరికి ఎంత పంచుతారన్నది ప్రశ్నగా మారింది. సాధారణ ప్రజలు దాచుకున్న సొమ్ముపై హుటాహుటిన దాడులు చేసే ఈడీ అధికారులు.. ఈ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారన్న ప్రశ్నలు కూడా తెరమీదికి రావడం గమనార్హం.
This post was last modified on July 3, 2026 11:06 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…