కొత్తగా యాపిల్ ప్రొడక్ట్స్ కొనాలని అనుకునేవారికి ఇది చేదు వార్తే. ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన మ్యాక్ బుక్, ఐప్యాడ్ మోడళ్ల ధరలను ఏకంగా 20 నుంచి 42 శాతం వరకు పెంచేసింది. ఇండియాలో కూడా ఈ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఉదాహరణకు M5 ప్రో చిప్ తో వచ్చే 14 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో లాంచ్ ప్రైస్ దాదాపు రెండున్నర లక్షలు ఉండగా, ఇప్పుడు అది ఏకంగా మూడు లక్షలకు చేరింది. ఇక ఐప్యాడ్ ఎయిర్ బేస్ మోడల్ ధర కూడా 84 వేల నుంచి లక్షా ఇరవై వేలకు పెరిగిపోయింది.
అసలు రేట్లు ఇంత దారుణంగా ఎందుకు పెరిగాయంటే, దీని వెనుక కృత్రిమ మేధ డేటా సెంటర్ల హవా ఉంది. ఈ ఏఐ డేటా సెంటర్ల కోసం మెమరీ, స్టోరేజ్ చిప్‌లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీనివల్ల సెమీకండక్టర్ల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటివరకు ఈ భారాన్ని కస్టమర్ల మీద పడకుండా తామే భరించామని, కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వస్తోందని యాపిల్ యాజమాన్యం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నిర్ణయం యూజర్లకు నిరాశ కలిగిస్తుందని తెలుసని, అయినా వేరే దారి లేదని కంపెనీ చెప్పుకొచ్చింది.
ధరల పెంపు ప్రకటన రాగానే మార్కెట్లో యాపిల్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఏప్రిల్ తర్వాత ఎన్నడూ లేని విధంగా షేర్ వాల్యూ దాదాపు ఆరు శాతం మేర పడిపోయింది. నిజానికి మెమరీ చిప్‌ల కొరత తీవ్రంగా ఉండబోతోందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ గతంలోనే హెచ్చరించారు. ఈ చిప్ షార్టేజ్ వల్ల ఇప్పటికే కొన్ని మ్యాక్ మోడళ్ల తయారీ, డెలివరీలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఈ ఇబ్బందులు ఇప్పట్లో తీరేలా లేవని, రాబోయే కొన్ని నెలల పాటు ఈ కొరత ఇలాగే కొనసాగుతుందని అన్నారు.
ప్రస్తుతానికి ఐఫోన్, ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కానీ భవిష్యత్తులో వాటి రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది సెప్టెంబర్ లో రాబోయే ఐఫోన్ 18 సిరీస్ లో ప్రో మోడళ్ల ధరలు భారీగా ఉండొచ్చని తెలుస్తోంది. కెమెరా విడిభాగాల ఖర్చు పెరగడం వల్ల ప్రో మోడళ్లపై కనీసం వంద డాలర్ల భారం పడే ఛాన్స్ ఉంది. ఇక నుంచి ఆపిల్ ప్రొడక్ట్స్ వాడే సామాన్య వినియోగదారుల జేబులకు మాత్రం ఈ నిర్ణయం వల్ల పెద్ద చిల్లు పెట్టినట్లే.
This post was last modified on June 26, 2026 9:25 am
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్…
న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…
ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…
అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ…
దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి ఉద్యమాలు జరుగున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్…