అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ లేదా పిఆర్ నుంచి కానీ రావడం సహజం. కానీ కింగ్ 100 విషయంలో అలాంటివి లేకుండా చూసుకున్నారు. లెనిన్ విడుదలయ్యే దాకా తన మూవీ గురించి ఎలాంటి వార్తలు రాకుండా నాగ్ తీసుకున్న జాగ్రత్తే దీనికి కారణం. ఇటీవలే కొడుకు మూవీ సూపర్ హిట్ అయిపోయి ఓటిటి స్ట్రీమింగ్ కూడా వచ్చేస్తోంది కాబట్టి ప్రధాన బాధ్యత తీరిపోయింది.
ఇప్పుడు అక్కినేని అభిమానుల చూపు తమ హీరో మైలురాయి ఎప్పుడు వస్తుందనే దాని మీద ఉంది. ఆగస్ట్ 29 నాగార్జున పుట్టినరోజు. ఖచ్చితంగా ఏదో ఒక కన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. దర్శకుడు కార్తీక్ ప్రస్తుతం టీజర్ సిద్ధం చేసే సాధ్యాసాధ్యాల గురించి టీమ్ తో చర్చిస్తున్నారట. ఒకవేళ కుదరకపోతే పోస్టర్ తో పాటు విడుదల తేదీ అనౌన్స్ చేయడం దాదాపు ఫిక్స్ అయినట్టే. లాటరీ కింగ్, కింగ్ 100 అనే రెండు టైటిల్స్ లో ఒకదాన్ని ఫిక్స్ చేయబోతున్నారు.
బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కాబోతున్న టైంలో నాగార్జునకు ఈ రెండు చాలా కీలకం కాబోతున్నాయి. ముఖ్యంగా కింగ్ 100 రూపంలో ఒక ముఖ్యమైన అసంతృప్తిని అభిమానుల్లో తొలగించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కుబేర, కూలిలో నాగార్జున చేసిన క్యారెక్టర్లు ఆ సినిమాలకు ఏ మేరకు ఉపయోగపడ్డాయో కానీ ఫ్యాన్స్ మాత్రం వాటిని చేసి ఉండకూడదని ఇప్పటికీ ఫీలవుతున్నారు. ఇప్పుడీ వందో మూవీ కనక హిట్టు కొడితే సోలో హీరోగా మళ్ళీ కంబ్యాక్ అయినట్టే.
ఇంత పెద్ద మైలురాయిని గ్రోయింగ్ స్టేజి లో ఉన్న డైరెక్టర్ కు ఇచ్చి నాగార్జున చాలా రిస్క్ తీసుకున్నారని అంటున్న వాళ్ళు లేకపోలేదు. అయితే శివ నుంచే ఇలాంటి ఎక్స్ పెరిమెంట్స్ చేయడం అలవాటుగా మార్చుకున్న నాగ్ వాటిని పట్టించుకునే పరిస్థితిలో లేరు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న కింగ్ 100లో చాలా గ్యాప్ తర్వాత టబు తనకు ఇష్టమైన నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. కాంపిటీషన్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే సంక్రాంతికి రావడం పక్కా అని టాక్.
This post was last modified on August 6, 2026 4:38 pm
అక్టోబర్ నెలాఖరు థియేటర్ ఆడియన్స్ కి రెండు ఛాయిసులున్నాయి. ఒకటి వెంకటేష్ ఆదర్శ కుటుంబం ఏకె 47 కాగా రెండోది…
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో పాటు ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్…
టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్లలో నాగవంశీ ఒకడు. సోషల్ మీడియాలో ఆయన గురించి జరిగినంత చర్చ ఇంకెవరి మీదా జరగదు…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థుల నామినేషన్ లను కూటమి పార్టీల నేతలు, పోలీసులు, అధికారులు అడ్డుకుంటున్నారని…
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి ఆలూరి బాల వెంకటే శ్వరరావు(ఏబీవీ)కు మాజీ…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై కూటమి పార్టీల మధ్య సఖ్యత కుదరడం లేదని వైసీపీ ప్రచారం…