Movie News

ఫ్యామిలీ జానర్ వదలకండి ప్లీజ్

టాలీవుడ్ లో ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే, అయితే వరల్డ్ బిల్డింగ్ లేదా ప్యాన్ ఇండియా. వీటి పేరుతో ఎలివేషన్లు ఉన్న కథలు రాస్తున్నారు. అడవి, దశాబ్దాల వెనుక ప్రపంచం, వింత శక్తులు ఉన్న పల్లెటూరు, గ్యాంగ్ స్టర్ మాఫియా, నేర సామ్రాజ్యం ఇలా ఒక పది రకాల కాన్సెప్టుల చుట్టే దర్శకులు చక్కర్లు కొడుతున్నారు. నిర్మాతలు కూడా ఇవే కావాలంటూ కోట్లకు కోట్లు ధారపోస్తున్నారు. ఇలాంటి తొందరపాటు చర్యల వల్లే రిలీజ్ ఆగిపోయిన పెద్ద సినిమాలు అయిదారు దాకా ఉన్నాయి.

అసలు జానర్ ని మన రచయితలు నిర్లక్ష్యం చేయడం ముమ్మాటికి తప్పే. తాజాగా వచ్చిన మా ఇంటి బంగారం మంచి ఉదాహరణగా నిలుస్తోంది. బడ్జెట్ హద్దులు మీరలేదు. పదుల కొద్దీ లొకేషన్లు, గ్రీన్ మ్యాట్లు, విఎఫ్ఎక్స్, విదేశీ ప్రయాణాలు ఇవేవి లేకుండా సింపుల్ గా ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో కూడిన ఒక క్లీన్ స్టోరీ రాశారు రాజ్ నిడిమోరు. దానికి తన అనుభవం ఉపయోగించిన దర్శకురాలు నందిని రెడ్డి మంచి అవుట్ ఫుట్ ఇచ్చి సమంత ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ వేశారు.

ఈ వాస్తవాన్ని చరిత్ర చాలా సార్లు చెప్పింది. మూస చిత్రాలు రాజ్యమేలుతున్న టైంలో నాగార్జున నిన్నే పెళ్లాడతా రికార్డులు బద్దలు కొట్టింది. వెంకటేష్ కలిసుందాం రా సాధించిన మైలురాళ్ళు గురించి చెప్పాలంటే పుస్తకాలు సరిపోవు. జూనియర్ ఎన్టీఆర్ బృందావనం, మహేష్ వెంకటేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ మొదలైన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ అతిగా ఉండవు. మితంగా ఉంటూనే క్లాసు మాస్ ఆడియన్స్ ని బ్రహ్మాండంగా మెప్పించాయి.

మళ్ళీ అలాంటి ట్రెండ్ ఊపిరి పోసుకోవాలి. అప్పుడే సినిమాలు వేగంగా పూర్తవుతాయి. జెన్ జీ పేరుతో సింపుల్ గా తప్పించుకుంటే కుదరదు. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో మా ఇంటి బంగారం మహిళలకు స్పెషల్ షో వేస్తే స్క్రీన్ దగ్గర డాన్స్ చేసింది పాతికేళ్ల లోపు యువతులే. సో కాన్సెప్ట్ బాగుండాలే కానీ అన్నీ కెజిఎఫ్ పుష్పలే కావాలని జనాలు కోరుకోవడం లేదు. కుటుంబ కథా చిత్రాలు అనే ట్యాగ్ లో ఎంత బలముందో హిస్టరీ బుక్స్ ని మరోసారి తిరగేసి మన రైటర్లు ఆ దిశగా ఆలోచించడం అవసరం.

This post was last modified on June 25, 2026 10:52 pm

Share

Recent Posts

నష్టాలు వచ్చాయని ఒప్పుకున్న నాని

తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…

4 minutes ago

చివరి మ్యాచ్‌లోనూ అదే మెస్సీ… వారసుడికే గోల్ ఇచ్చి వెళ్లాడు!

21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…

9 minutes ago

అక్కడ కలెక్షన్ల వర్షం… ఇక్కడ వసూళ్ల నీరసం

కొన్ని సినిమాలు నేటివిటీ మీద ఆడతాయి. ఒక చోట బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన పక్కన కూడా అదే రిజల్ట్…

55 minutes ago

వరప్రసాద్ స్నేహితులకు ఒకే సమస్య

మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…

2 hours ago

నాలుగేళ్ల తర్వాత టీమ్ఇండియాలో

ఒకసారి టీమ్ఇండియా నుంచి బయటకు వెళ్లాక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం అంత ఈజీ కాదు. అందులోనూ 36 ఏళ్ల…

2 hours ago

ఏమీ పట్టనట్టువుంటే ఎలా జగన్?

స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…

3 hours ago