మానవ చరిత్రలో కల్లా అత్యంత గొప్ప కథ.. నిన్నటి ‘రామాయణం’ ట్రైలర్లో మేకర్స్ ఈ కథకు ఇచ్చిన ట్యాగ్ లైన్. రామాయణ గాథ గురించి తెలిసిన వాళ్లంతా ఈ విషయాన్ని అంగీకరిస్తారు. ఆ కథ అంత గొప్పది.. అందులోని పాత్రలు అంత ఉన్నతమైనవి. డ్రామాకు లోటుండదు. ఆసక్తికర మలుపులుంటాయి. భావోద్వేగాలు పతాక స్థాయికి తీసుకెళ్లే ఘట్టాలు అందులో బోలెడు. ఈ కథను సినిమాగా, సీరియల్‌గా ఎన్నోసార్లు తీశారు. ప్రతిసారీ ఆకట్టుకుంది. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని అద్భుత గాథ అది.
దృశ్యపరంగా చూడడం కాదు.. కేవలం ఆ కథను విన్నా సరే గొప్పగా అనిపిస్తుంది. దానికి సరైన విజన్ తోడైతే వెండితెరపై అద్భుతం ఆవిష్కృతమవుతుంది. కానీ ఈ తరం ఫిలిం మేకర్స్ ఈ కథ ఔన్నత్యాన్ని అర్థం చేసుకోకుండా.. అవసరం లేని హంగులతో దాని అనుభూతిని పాడు చేస్తున్నారా అనే భావన కలుగుతోంది. ఇంతకుముందు ‘ఆదిపురుష్’ సినిమాలో ఓం రౌత్ అర్థం పర్థం లేని క్రియేటివిటీతో రామాయణ గాథను ఎంతగా చెడగొట్టాలో అంతా చెడగొట్టాడు.
ఇప్పుడు ‘రామాయణ’ టీం తమ వెర్షన్‌తో రెడీ అయింది. ‘ఆదిపురుష్’తో పోలిస్తే ఇది చాలా బెటర్ అనే తప్ప.. ట్రైలర్ చూస్తే పూర్తి సంతృప్తి అయితే కలగలేదు. ముఖ్యంగా ఇందులోని భారీతనం, విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే సహజత్వం లోపించిన భావన కలుగుతోంది. రామాయణ గాథను ఉన్నదున్నట్లుగా తీయకుండా.. దానికి లేని భారీతనాన్ని ఆపాదించే ఎందుకు ఆపాదిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మన దగ్గర ‘సంపూర్ణ రామాయణం’ లాంటి సినిమాలు అద్భుత విజయాన్నందుకున్నాయంటే అందులో భారీతనం ఉండడం వల్ల కాదు. రాామాయణ గాథను ఒక డివైన్ ఫీలింగ్ కలిగేలా సహజంగా.. హృద్యంగా తీయడం వల్లే. ముఖ్య పాత్రల్లో నటించిన ఆర్టిస్టులందరూ ఆయా క్యారెక్టర్లకు సరిగ్గా సూటవడం, అద్భుతంగా నటించడంతో గొప్ప అనుభూతి కలిగింది. కానీ ఇప్పుడు ప్రతి పాత్రనూ ఎగ్జాజరేట్ చేసి చూపిస్తున్నారు. వాళ్ల ఆహార్యం, ఉపయోగించే వాహనాలు, నిర్మాణాలు, జంతువులు, రాక్షస రూపాలు.. ఇలా ప్రతిదాంట్లోనూ ఆడంబరం కనిపిస్తోంది.
ఏదో గొప్పగా చూపించాలనే తాపత్రయంలో సహజత్వం కొరవడుతోంది. అసలు కథలోనే ఎంతో గొప్పదనం ఉన్నపుడు.. ఈ ఆడంబరాలు, భారీతనం, శ్రుతి మించిన విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు పెరిగిన భారీ బడ్జెట్లు, అందుబాటులో ఉన్న సాంకేతికత ఇవన్నీ సినిమాకు అలంకారంగా మారాలే తప్ప.. కథను డామినేట్ చేసేలా, కిల్ చేసేలా ఉండకూడదు. అప్పుడు ‘ఆదిపురుష్’కు అయినా.. ఇప్పుడు ‘రామాయణం’లో అయితే ఇదే జరిగినట్లు అనిపిస్తోంది. ఈ సినిమాలను చూసేటపుడు కలగాల్సిన డివైన్ ఫీలింగ్ మిస్ అవుతోంది.
This post was last modified on August 1, 2026 9:00 am
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
తన చేతికి గాయం అయింది సర్జరీ చేసుకుంటున్నా అంటూ కొన్ని నెలల ముందు షాకింగ్ అప్‌డేట్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…