Trends

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే విధంగా పేపర్ లీక్ అయిందని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.

పరీక్షకు ముందు రోజు 100కు పైగా ప్రశ్నలు లీక్ అయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయని తెలుస్తోంది.

మహారాష్ట్రలోని నాసిక్ లో మొదలైన ఈ లీక్ వ్యవహారం మొత్తం 5 రాష్ట్రాలకు పాకిందని తెలుస్తోంది. క్వశ్చన్ పేపర్ కాపీని హరియాణాకు పంపి అక్కడ సెట్ కు 10 కాపీల చొప్పున 5 వేర్వేరు సెట్లను ప్రింట్ చేశారట.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్ లకు తెలుస్తోంది. రాజస్థాన్ లోని ఓ హాస్టల్లోని ‘గెస్ పేపర్’ పై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ గెస్ పేపర్ లోని 410 ప్రశ్నల్లో 120 పరీక్షలో రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇక, పరీక్షకు 2 రోజుల ముందు క్వశ్చన్ పేపర్ ను నీట్ గా అభ్యర్థులకు అమ్మారట. ఒక్కో పేపర్ 5 లక్షలకు బేరం పెట్టారని, పరీక్ష రోజు దాని రేటు 30 వేలకు తగ్గించారని తెలుస్తోంది. నాసిక్ లో పేపర్ లీక్ చేసిన నిందితుడిని రాజస్థాన్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో 5 రాష్ట్రాలకు చెందిన 9 మంది అరెస్టయ్యారు.

This post was last modified on May 12, 2026 5:57 pm

Share

Recent Posts

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

1 hour ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

2 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

3 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

4 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

4 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

5 hours ago