Trends

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే…ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ చేస్తూ వారిని బురిడీ కొట్టిస్తున్న తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. వాహనం ఒకటే… అయితే దానికి ఎప్పుడు పడితే అప్పుడు నెంబర్ మారిపోతుంది.

ఇందుకోసం ఈ మాయగాడు ఏకంగా ఓ కొత్త టెక్నాలజీనే రూపొందించాడు. ఆ టెక్నాలజీతో పోలీసులను మాయ చేస్తూ… వాహనానికి పడిన ఛలాన్లు క్లియర్ చేయకుండా తిరుగుతున్నాడు. అయితే తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదు కదా. ఇతడు కూడా అలాగే పట్టుబడిపోయాడు. ఇతగాడు రూపొందించిన ఆ టెక్నాలజీని చూసి ఖాకీకే నోరెళ్లబెట్టేశారట.

హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే…ఓ ఖరీదైన కారుతో నగరంలో చక్కర్లు కొడుతున్న ఓ వ్యక్తి… రహదారి నిబంధనలను నిత్యం అతిక్రమిస్తూ తిరుగుతున్నాడట. ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించిన సమయాల్లో పోలీసులు ఆ వాహనానికి జరిమానా విధిస్తూ ఛలాన్లు జారీ చేస్తున్నారు. అయితే ఈ ఛలాన్లకు సంబంధించిన సొమ్మును చెల్లించకుండానే అతగాడు యథేచ్ఛగా తిరుగుతున్నాడట. అయితే డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా అతగాడు శనివారం రాత్రి పట్టుబడ్డాడట.

ఈ సందర్భంగా అతడి కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు… అందులోని నయా టెక్నాలజీని చూసి అవాక్కయ్యారట. ఆ టెక్నాలజీ ఏంటంటే… సదరు వాహనం నెంబరును ఎప్పటికప్పుడు మార్చేసేందుకు ఆ వ్యక్తి సదరు టెక్నాలజీని రూపొందించాడట. ఈ టెక్నాలజీని ఇప్పటికే పలుమార్లు వినియోగించిన సదరు వ్యక్తి తన కారుపై ఉన్న లెక్కలేనన్ని ఛలాన్ల జరిమానాను చెల్లించకుండానే తిరుగుతున్నాడు.

ఇందుకు అతగాడు కారు నెంబర్ ప్లేట్లను ఎప్పటికప్పుడు మార్చాడట. అతడు వినియోగించిన టెక్నాలజీలో ఓ బటన్ నొక్కితే కారు నెంబర్ ఇట్టే మారిపోతుందట. ఇలా పోలీసులు కనిపించినప్పుడల్లా తన కారు నెంబరును మార్చేసుకుని వారి నుంచి తప్పించుకుని అతగాడు తిరుగుతున్నాడట.

This post was last modified on April 12, 2026 4:13 pm

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

24 minutes ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

30 minutes ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

45 minutes ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

1 hour ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago