మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్ వస్తుందని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా టీజర్ లాంటిది వదిలితే సోషల్ మీడియా షేక్ అయిపోతుందని వాళ్ళ నమ్మకం. కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం తారక్ బర్త్ డేకి ఎలాంటి వీడియో రాకపోవచ్చు. టైటిల్ రివీల్ లేదా ఒక పవర్ ఫుల్ పోస్టర్ లాంటిది వదిలి అక్కడితో సర్దుకోమనొచ్చని వినికిడి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇది జరిగితే ఫ్యాన్స్ నిరాశ పడతారు. ఎందుకంటే అసలు సినిమా విడుదలే జూన్ లో ఉంటుందని గతంలో ప్రకటించారు. అలాంటిది ఇప్పుడు కనీసం టీజర్ ఇవ్వకపోవడం అంటే ప్లానింగ్ లోపమనే తెలుస్తుంది. అయితే జోర్దాన్ లో షూట్ చేస్తున్నప్పుడు కలిగిన అవాంతరాలు, టోవినో థామస్ తప్పుకున్నాక మరో ఆర్టిస్టుని రీ ప్లేస్ చేయడంలో జరిగిన ఆలస్యం లాంటి కారణాలు ఎప్పటికప్పుడు స్పీడ్ బ్రేకర్స్ లా మారిపోయాయి. అందుకే ఈ తిప్పలు.
సో ఎందుకైనా మంచిది ఫ్యాన్స్ అన్నింటికీ ప్రిపేరయ్యి ఉండటం మంచిది. ఈ లెక్కన సినిమా రిలీజ్ ఎప్పుడనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం తనను ఒత్తిడి చేయొద్దని, డెడ్ లైన్స్ పెట్టుకుని చేయడం తన పద్ధతి కాదని ముందే తేల్చి చెప్పడంతో మైత్రి మేకర్స్ సైతం ఏం చెప్పలేకపోతున్నారని టాక్. ఇలా అయితే దసరా దీపావళి కూడా మిస్ అయ్యేలా ఉంది. 2027 సంక్రాంతి అనుకుంటే మాత్రం పోటీ రసవత్తరంగా మారుతుంది.
డ్రాగన్ టైటిల్ లాక్ చేశారా లేదానేది కూడా ఇంకా ఖరారు చేయలేదు. ఆల్రెడీ ఈ పేరుతో గత ఏడాది ప్రదీప్ రంగనాథన్ సినిమా వచ్చింది కాబట్టి వేరే పేరు కోసం నీల్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. మూవీలో తారక్ పేరునే పెట్టాలనే ప్రతిపాదనని సీరియస్ గా చూస్తున్నారట. మరి మే 20కి అది క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి. దేవర తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ రావడం, వార్ 2 డిజాస్టర్ కావడం లాంటివి జరగడంతో అభిమానుల ఆశలన్నీ నీల్ మీదే ఉన్నాయి.
This post was last modified on April 12, 2026 9:55 pm
రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలకు తమిళనాడు కేరాఫ్‌గా ఉంది. నాటి జయలలిత, కరుణానిధి ప్రభుత్వాల నుంచి నేటి…
తమిళంలో పేరున్న దర్శకుల్లో వెంకట్ ప్రభు ఒకరు. చెన్నై-28తో మొదలుపెట్టి చాలా హిట్లే ఇచ్చారు. చివరగా విజయ్ హీరోగా గ్రేటెస్ట్…
ఎలక్ట్రానికి ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లపై చాలా సంవత్సరాలుగా చర్చ నడుస్తోంది. ఈవీఎంలు ట్యాంపర్ చేయడం సాధ్యమేనని కొందరు ప్రోటోటైప్ ఈవీఎంలను ట్యాంపర్…
రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడొకప్పుడు బెడిసికొట్టడం సహజం. కానీ, ఒక ఉమ్మడి జిల్లాలో పార్టీ అధినేత నేరుగా రంగంలోకి దిగి పావులు…
కొన్నిసార్లు దర్శకులు కథ చెప్పినంత బాగా సినిమా తీయలేకపోతుంటారు. అందుకు అనుభవ లేమి కూడా కారణం కావచ్చు. లేదంటే రాత…
తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో కవిత…