రాష్ట్రంలో పెట్రోల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వం, పెట్రోలియం అసోసియేషన్ క్లారిటీ ఇచ్చినా.. బంకుల వద్ద జనం బారులు తీరడం ఆగడం లేదు. నిజానికి మన దగ్గర ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, కానీ ఒక వింత పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. లేని డిమాండ్‌ను ఉన్నట్లుగా భ్రమపడటమే ఈ గందరగోళానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. కావాలని బ్యాక్ గ్రౌండ్ లో సరుకు చకచకా అమ్మేసుకోవలనే ప్లాన్ లో కొందరు బంక్ యజమానులు ఫేక్ న్యూస్ లు వైరల్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
సాధారణంగా ఒక లోకల్ పెట్రోల్ బంక్ అండర్ గ్రౌండ్ ట్యాంక్ సామర్థ్యం సుమారు 20,000 లీటర్లు ఉంటుంది. రోజుకు ఒక 500 మంది వచ్చి వంద, రెండు వందల రూపాయల పెట్రోల్ కొట్టించుకుంటే, ఆ స్టాక్ కనీసం మూడు నాలుగు రోజుల పాటు హాయిగా వస్తుంది. కానీ ఎక్కడో ఎవరో చెప్పిన ‘రేపటి నుండి పెట్రోల్ దొరకదట’ అనే ఒక చిన్న ఫేక్ న్యూస్, వేలాది మందిని ఒకేసారి రోడ్డు మీదకు తెచ్చింది. ప్రతి ఒక్కరూ తమ ట్యాంకులను ఫుల్ చేయించుకోవాలని చూడటంతో, నాలుగు రోజులు రావాల్సిన స్టాక్ కేవలం నాలుగు గంటల్లోనే ఖాళీ అయిపోతోంది.
అంటే బంక్ దగ్గర ఒక పది మంది లైన్ లో నిలబడితే, పక్కన వెళ్లేవారు కూడా ఏదో అయిపోతుందనే భయంతో వచ్చి లైన్ లో నిలబడతారు. దీనివల్ల బంక్ యజమాని ‘నో స్టాక్’ బోర్డు పెట్టాల్సి వస్తుంది. ఆ బోర్డును చూసిన మరికొందరు ఇది నిజమైన కొరత అని ఫిక్స్ అయిపోయి మరింత పానిక్ అవుతున్నారు. నిజానికి దేశవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు చాలా పక్కాగా ఉన్నాయి. ముంబై తీరానికి లక్ష టన్నుల ముడి చమురుతో కూడిన ట్యాంకర్లు సురక్షితంగా చేరుకున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
అమెరికా ఇరాన్ యుద్ధ పరిస్థితుల వల్ల రేట్లు పెరగవచ్చనే ప్రచారం కూడా ఈ భయానికి ఒక కారణం. అయితే ప్రభుత్వం ఇప్పటికే మూడు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని భరోసా ఇచ్చింది. అనవసరంగా పెట్రోల్ నిల్వ చేసుకోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది తప్ప, ఎవరికీ లాభం లేదు. ఈ విషయంలో వాహనదారులు ఎవరి మాటలో విని ఆందోళన చెందకుండా, వాస్తవాలను గమనించాలని ఇప్పటికే పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చారు.
గుంపులో గోవిందాలా అందరితో కలిసి భయపడటం కంటే, డేటా అండ్ ఫాక్ట్స్ తో ఆలోచించడం ముఖ్యమనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా ఇంధన సమస్య లేదు. ఈ కృత్రిమ కొరతను సృష్టించింది కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే అని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం కూడా ఈ విషయంలో జనాలకు మరింత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని మరికొందరు చెబుతున్నారు.
This post was last modified on March 25, 2026 12:44 pm
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా కబురు వచ్చేసింది. కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నట్లే విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యాపారవేత్తల కారణంగానే తమ…
ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్ విధించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ మంత్రివర్గం..…