Political News

పోలీసు యూనిఫాంలో ఉగ్ర‌వాదులు… ఢిల్లీ నిర‌స‌న‌ల్లో కుట్ర‌?

నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీకి వ్య‌తిరేకంగా విద్యార్థులు చేప‌ట్టిన ఢిల్లీ నిర‌స‌న‌లో ఉగ్ర‌వాదుల కుట్ర కోణం బ‌య‌ట ప‌డింద‌ని ఢిల్లీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. ముఖ్యంగా పోలీసుల మాదిరిగా ఉగ్ర‌వాదులు కూడా యూనిఫాం ధ‌రించి.. విద్యార్థుల‌ను చెద‌ర‌గొడుతున్న‌ట్టుగా న‌టించి.. పేలుళ్ల‌కు తెగ‌బ‌డేలా ప్లాన్ చేశార‌ని.. సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. దీని వెనుక పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర‌వాద‌ సంస్థ జైషే మ‌హ్మ‌ద్ ఉంద‌ని పేర్కొన్నారు. దీనిపై ప‌క్కా ఆధారాల‌ను కూడా సేక‌రించామ‌ని వివ‌రించారు.

ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ యువ‌తిని అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించిన‌ప్పుడు ఆయా విష‌యాలు వెలుగు చూసిన‌ట్టు టాస్క్‌ఫోర్స్ అధికారులు వెల్ల‌డించారు. బెంగాల్ ముఖ్యమంత్రి, బీజేపీనేత‌ సువేందు అధికారిని కూడా చంపేసే ప్లాన్ చేసుకున్న‌ట్టు వివ‌రించారు. ప‌క్కా ప్లాన్‌తోనే జైషే ఉగ్ర‌వాదులు హ‌మీమ్ అనే వ్య‌క్తికి ఆదేశాలు ఇచ్చార‌ని తెలిపారు. దీనికిగాను కొంద‌రు యువ‌త‌ను వినియోగించుకున్న‌ట్టు తెలిపారు. వీరు వాస్త‌వ పోలీసుల మాదిరిగా యూనిఫాంలో వ‌చ్చి.. విద్యార్థుల్లో అల‌జ‌డి సృష్టించి.. అనంత‌రం విధ్వంసం చేయాల‌ని ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్న‌ట్టు తెలిపారు.

మ‌రి వ‌చ్చారా?

అయితే.. ఉగ్ర‌వాదులు.. పోలీసు యూనిఫాంలో ఢిల్లీలో జ‌రిగిన విద్యార్థుల నిర‌స‌న‌లో చొర‌బ‌డ్డారా? లేదా? అనే విష‌యంపై అధికారులు స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. దీనికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలిపారు. కొంద‌రు పోలీసులు.. నిర‌స‌న‌ల స‌మ‌యంలో స్కార్ఫ్‌లు ధ‌రించి ఉన్నార‌ని, ముఖానికి మాస్కులు పెట్టుకుని ఉన్నార‌ని.. వీరు ఎవ‌ర‌నేది విచార‌ణ చేస్తున్నామ‌న్నారు. అదేస‌మ‌యంలో కొంద‌రు పోలీసులు.. విద్యార్థుల‌తో క‌లిసి రాళ్లు రువ్వుతున్న ఘ‌ట‌న‌ల‌ను కూడా గుర్తించామ‌న్నారు. ఇది అసాధార‌ణ‌మ‌ని పేర్కొన్నారు.

ఆది నుంచి అనుమానం..

మ‌రోవైపు.. ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర హోం శాఖ కూడా ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ఢిల్లీలో ప‌రిస్థితులు సునిశితంగా ఉన్నాయ‌ని తాము ఆది నుంచి చెబుతున్నామ‌ని తెలిపింది. విద్యార్థుల రూపంలో ఉగ్ర‌వాదులు ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని తాము అనుమానించామ‌ని.. ఇంటిలిజెన్స్ కూడా ఇదే చెప్పింద‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలోనే విద్యార్థుల‌తో త‌క్ష‌ణ‌మే చ‌ర్చ‌లు జ‌రిపేలా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు వివ‌రించింది. ప్ర‌స్తుతం ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని.. ఉగ్ర‌వాద స‌మూహాల‌కు స‌హ‌క‌రించేవారిని ఉపేక్షించేది లేదని స్ప‌ష్టం చేసింది.

This post was last modified on August 2, 2026 10:18 pm

Share

Recent Posts

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

3 hours ago

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

4 hours ago

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…

5 hours ago

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

6 hours ago

ఒత్తిడి బండి మీద ‘రణబాలి’ ప్రయాణం

ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…

6 hours ago

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

7 hours ago