Trends

లక్షన్నర ఫ్లైట్ టికెట్ ఇప్పుడు 9 లక్షలు ఎందుకుంది?

ఎవడో యుద్దం చేసుకోవటం.. మరెవరో దానికి సంబంధించిన మూల్యాన్ని చెల్లించాల్సి రావటం. నిజానికి యుద్దంతో ఇదే తంటా. మనకు ఏ మాత్రం సంబంధం లేని దేశాల మధ్య పంచాయితీకి మిగిలిన ప్రపంచం మొత్తం ఇబ్బందులు పడుతున్న దుస్థితి. కొవిడ్ తర్వాత నుంచి పలు దేశాల మధ్య మొదలైన యుద్ధాలతో ప్రపంచం తల్లడిల్లుతున్న పరిస్థితి.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. తాజాగా మొదలైన ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా మధ్య మొదలైన యుద్ధం మరో ఎత్తు. పేరుకు ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్దం జరుగుతున్నప్పటికి.. పరోక్షంగా యూఏఈ మొత్తం యుద్ధ ప్రభావం నేరుగా పడుతున్న పరిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. భారత్ నుంచి అమెరికా, యూరోప్ వెళ్లే వారికి యూఏఈ గేట్ వే గా ఉండటం.. అక్కడ ఫ్లైట్ మారటంలాంటివి సర్వసాధారణం. యుద్ధం కారణంగా ఆ లింక్ తెగటంతో ఇప్పుడు ఆయా దేశాలకు విమాన ప్రయాణాలు ఇప్పుడు విపరీతమైన ఖర్చుతో కూడుకున్నవిగా మారాయి.

భారత్ నుంచి లండన్, న్యూయార్క్, ఫ్రాంక్ ఫర్ట్ లాంటి రూట్ల విమాన టికెట్ ధరలు గతానికి భిన్నంగా భారీగా పెరిగిన పరిస్థితి. గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఒక్కో టికెట్ ధర పది రెట్ల వరకు పెరిగాయి. లండన్, న్యూయార్క్ లాంటి మహానగరాలకు వెళ్లే విమానాలకు దుబాయ్ హబ్ గా ఉండేది. యుద్దం కారణంగా ఆ సర్వీసులు రద్దు అయ్యాయి.

దీంతో.. డైరెక్టు ఫ్లైట్లకు భారీగా గిరాకీ పెరిగింది. దీంతో టికెట్ల ధరలు ఆకాశానికి అంటాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే లండన్  నుంచి ముంబయి.. ఢిల్లీకి వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ కు సంబంధించి మిగిలిన ఆఖరి సీటుధర ఏకంగా రూ.9 లక్షలు పలకటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విడి రోజుల్లో ఈ టికెట్ ధర రూ.1.5లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఉండేది. అందుకు భిన్నంగా మూడు రెట్లకు పైనే టికెట్ ధర పెరగటం గమనార్హం.

హైదరాబాద్ – లండన్ మధ్య డైరెక్టు ఫ్లైట్ టికెట్ ధర రెట్టింపుఅయితే.. భారత్ నుంచి జర్మనీ (ఫ్రాంక్ ఫర్ట్)కు వళ్లే వాటి టికెట్ ధరలు 300 శాతం పెరిగాయి. అదే విధంగా అమెరికాకు వెళ్లే డైరెక్టు ఫ్లైట్ టికెట్  ధర కూడా భారీగా పెరిగాయి. దీంతో.. అమెరికా.. యూరోప్.. లండన్ కు వెళ్లే వారి జేబుకు చిల్లు పడుతున్న పరిస్థితి.

మామూలుగా అయితే.. లండన్ నుంచి ముంబయికి సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ.20వేల నుంచి రూ.40వేల మధ్య ఉంటే.. ప్రస్తుతం రూ.2.90 గరిష్ఠ ధర పలుకుతుంది. లండన్ నుంచి ముంబయిలో బిజినెస్ క్లాస్ రూ.1.2 లక్షల నుంచి రూ.2.5లక్షలు పలికేది. ఆ టికెట్ ధర ఇప్పుడు ఏకంగా రూ.9లక్షలకు చేరుకోవటం గమనార్హం. ఢిల్లీ – లండన్ మధ్య మామూలు రోజుల్లో 60 వేలు ఉన్న టికెట్ ధర ఇప్పుడు రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెరిగిపోయిన పరిస్థితి.

గల్ఫ్ దేశాల గగనతలం మూతపడటంతో ప్రతిరోజూ 700 కంటే ఎక్కువ అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావటంతో.. విపరీతమైన డిమాండ్ పెరిగింది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులు.. వ్యాపారవేత్తలు.. అత్యవసర పని మీద వెళ్లాల్సిన కుటుంబాలు అయితే ఎంత ధర చెల్లించి అయినా టికెట్లు కొనేస్తున్నారు.

భారత్ నుంచి లండన్, న్యూయార్క్, ఫ్రాంక్ ఫర్ట్ వెళ్లే విమానాల కంటే.. అటువైపు నుంచి భారత్ కు వచ్చే విమాన టికెట్లకు డిమాండ్ భారీగా నెలకొన్న పరిస్థితి. పెరిగిన డిమాండ్ కు తగ్గట్లు భారత్ నుంచి ఈ నగరాలకు విమాన సర్వీసులు పెరగటం గమనార్హం. గతంలో ఢిల్లీ నుంచి లండన్ కు రోజుకు మూడు -నాలుగు విమాన సర్వీసులు ఉండేవి. ఇప్పుడు అవి కాస్తా 10-12కు సర్వీసులు పెరిగాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా పెరిగిన విమాన టికెట్ ధరలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి.

This post was last modified on March 5, 2026 6:23 am

Share

Recent Posts

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

12 minutes ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

48 minutes ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

2 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

2 hours ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

7 hours ago

కరెంటు లేని కాలం కావాలంటున్న డైరెక్టర్

ఇప్పుడు డబ్బుతో పాటు అన్ని సౌకర్యాలూ ఉన్నా సరే.. ఏమీ లేని ఒకప్పటి రోజులే బాగున్నాయి అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు.…

8 hours ago