తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలోని కూర్మాపురం, కడియంవాసులకు 6 రోజులుగా కంటి మీద కునుకు లేదు. ఆ ప్రాంతంలో తిరుగుతున్న పెద్ద పులి ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో…దాడి చేస్తుందో అని చుట్టుపక్కల గ్రామాల వారు కూడా హడలిపోయారు. ఆ పెద్దపులిని దాని పాదముద్రల ఆధారంగా పట్టుకునేందుకు ఆరు రోజులుగా అటవీ సిబ్బంది నానా తిప్పలు పడ్డారు.
పులి జాడ, పాదముద్రలు కనిపించిన ప్రాంతాలను బట్టి ట్రాప్ లను, నైట్ విజన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే 6 రోజులుగా వారందరినీ ముప్పుతిప్పలు పెట్టిన పెద్దపులి ఎట్టకేలకు చిక్కింది. చివరకు కూర్మాపురంలోని పాడుబడిన ఇంట్లో ఉన్న పులికి మత్తు మందు ఇచ్చి అటవీ శాఖ అధికారులు బంధించారు.
ఆ ఇంట్లో నుంచి పులి గాండ్రింపులు వినిపిస్తున్నాయని అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారమిచ్చారు. దీంతో, తుపాకీతో మత్తు ఇంజక్షన్ షూట్ చేసి పులిని పట్టుకోవాలని వారు ప్రయత్నించారు. అయితే, జనం అలజడికి అదిరిబెదిరిన పులి ఆ ఇంట్లో నుంచి సమీపంలోని పొలాల్లోకి పారిపోయింది. అయితే, పులిని వెంటాడిన అటవీ శాఖ సిబ్బంది ఎట్టకేలకు సాయంత్రం కొత్త చెరువు వద్ద మత్తు ఇంజక్షన్ తో షూట్ చేసి పులిని బంధించారు.
అంతకుముందు, తూ.గో జిల్లాలోని రఘునాథపురం, రాజానగరం, జి.యర్రంపాలెంలో 3 ఆవులు, ఒక దూడను చంపింది. అదృష్టవశాత్తూ మనుషులు పులి కంట పడలేదు. అయినా సరే జిల్లా వాసులు భయాందోళనకు గురయ్యారు.
ఈ క్రమంలోనే ఆరు రోజుల పాటు పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమించారు. పుణె, ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం పులి జాడ గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు, థర్మల్ డ్రోన్లు, ఆధునిక పరికరాలను ఉపయోగించింది. తమను దాదాపు వారం రోజుల పాటు ముప్పుతిప్పలు పెట్టిన పులి చివరకు చిక్కడంతో తూ.గో జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
This post was last modified on February 7, 2026 8:17 am
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…