ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందని తెలిసిందే. ఐతే స్టార్ సినిమాల్లో కథానాయికలను కేవలం పాటల కోసమే వాడేస్తున్నారు అనే మాట వినిపిస్తుంది. కొన్ని సినిమాలు చూస్తే అది నిజమే అని అనిపించక తప్పదు. కానీ కమర్షియల్ సినిమాల్లో కూడా కథానాయిక పాత్రలకు మంచి అవకాశం దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి.

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవడంలోనే కథానాయికల కెరీర్ ఆధారపడి ఉంటుంది. వాళ్లు ఎంచుకునే కథలు.. చేసే పాత్రలను బట్టే గ్రాఫ్ నిర్ణయించబడుతుంది. ఐతే టాలీవుడ్ లో హీరోయిన్స్ నెంబర్ గేమ్ ఒకప్పుడు చర్చల్లో ఉండేది కానీ ఇప్పుడు అది అసలు వినిపించట్లేదు. ఫలానా హీరోయిన్ బాగా చేస్తుందని అనుకునే సరికి ఆమెకు వరుస రెండు ఫ్లాప్ సినిమాలు పడగానే వెనకబడిపోతుంది.

తెలుగు పరిశ్రమలో కొన్నాళ్లు టాప్ లో ఉన్న హీరోయిన్స్ అంతా కూడా ఇప్పుడు బ్యాక్ అయ్యారు. అనుష్క, కాజల్, సమంత, తమన్నా లాంటి భామల హవా ముగిసినట్టే. నిన్న మొన్నటిదాకా రష్మిక కూడా నెంబర్ 1 స్థానంలో ఉన్నట్టు అనిపించగా ఆమె కూడా బాలీవుడ్ వెళ్లడంతో ఇప్పుడు ఆ ప్లేస్ ఖాళీ అయ్యింది.

కొత్త కథానాయికలు భాగ్య శ్రీ, శ్రీలీల, రుక్మిణి వసంత్ లాంటి భామల సందడి బాగున్నా వీళ్లలో టాప్ రేంజ్ కి వెళ్లే అవకాశం ఎవరికి ఉంటుందనే చర్చ నడుస్తుంది. ప్రస్తుతానికి అయితే కథానాయికల విషయంలో ఈ నెంబర్ గేమ్ లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ముందు చెప్పినట్టుగానే వరుసగా ఎన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు చేసినా ఒకటి రెండు సినిమాలు నిరాశపరిస్తే చాలు ఆమెను పక్కన పెట్టేస్తున్నారు. అందుకే కొత్త హీరోయిన్స్ కి మంచి అవకాశం దక్కుతుంది.

తెలుగు పరిశ్రమలో ఎప్పుడు హీరోయిన్స్ కొరత అన్నది ఉంటుంది. మహా అయితే ఒక ఐదారేళ్లు స్టార్ ఫామ్ కొనసాగించిన కథానాయిక కూడా గ్రాఫ్ పడిపోక తప్పదనే పరిస్థితి ఉంటుంది. కేవలం కొద్దిమంది కథానాయికలు మాత్రమే దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంటుంది. అది వాళ్లు మొదటి నుంచి ఒక పద్ధతి ప్రకారంగా తమ కెరీర్ ని ప్లాన్ చేసుకున్నారు కాబట్టే పది పదిహేనేళ్లు అయినా ఇంకా అవకాశాలను అందుకుంటున్నారు. సినిమాకు గ్లామర్ తెచ్చే కథానాయికలు కూడా ప్రతి సినిమాతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

This post was last modified on February 6, 2026 10:11 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్ పర్యటనలు: క్యాడర్‌కు జోష్.. జనాలకు ట్రాఫిక్ కష్టాలు

పదుల సంఖ్యలో కార్లు, వందల సంఖ్యలో బైక్‌లు.. కాన్వాయ్ నడుస్తుండగా చుట్టూ జనాలు.. పార్టీ జెండాలు.. పూల వర్షాలు.. సందర్భం…

26 minutes ago

‘ఆ నెయ్యి’లో బాత్‌రూం క్లీన్ చేసే రసాయనాలు: చంద్రబాబు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆ లడ్డూలో…

57 minutes ago

‘ఏపీలో కల్తీ రిక్రూట్‌మెంట్ బోర్డు’…అసలేంటిది?

'ఏపీలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు లాగా జగన్ "కల్తీ రిక్రూట్‌మెంట్ బోర్డు" అనే వ్యవస్థను స్థాపించారు. దానికి ఆయనే అధ్యక్షుడిగా…

2 hours ago

మొన్న అంబటి.. నేడు జోగి తప్పేం లేదంటోన్న జగన్

ఒక పార్టీకి అధినేత అయిన వ్యక్తి తన పార్టీకి చెందిన నేతలను కాపాడుకోవాలనుకోవడంలో ఎటువంటి తప్పూ లేదు. కానీ, ఆ…

3 hours ago

హమ్మయ్య… ఎట్టకేలకు దొరికిన పెద్దపులి

తూర్పు గోదావరి ప్రజలకు వారం నుండి కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్దపులిని అధికారులు కొద్దిసేపటి క్రితమే మత్తు…

3 hours ago

టీటీడీకి కొత్త ఈవో.. సవాళ్ల స్వాగతమేనా?!

తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఇంచార్జ్ కార్యనిర్వహణాధికారి (ఈవో)గా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు.…

4 hours ago