Political News

జగన్ పర్యటనలు: క్యాడర్‌కు జోష్.. జనాలకు ట్రాఫిక్ కష్టాలు

పదుల సంఖ్యలో కార్లు, వందల సంఖ్యలో బైక్‌లు.. కాన్వాయ్ నడుస్తుండగా చుట్టూ జనాలు.. పార్టీ జెండాలు.. పూల వర్షాలు.. సందర్భం ఏదైనా కావచ్చు.. పరామర్శల పేరుతో వైఎస్ జగన్ చేస్తున్న యాత్రల తీరు ఇదే. గంటలోపు పూర్తయ్యే ప్రయాణం 6 గంటల పాటు సాగడం సాధారణమైపోయింది. జనాలను సమీకరిస్తున్నారా? కార్యకర్తలు స్వచ్ఛందంగా వస్తున్నారా? అన్నది పక్కన పెడితే, దాదాపు ఏడాది కాలంగా ఒకే రీతిలో మూస పద్ధతిలో సాగుతున్న జగన్ పరామర్శ పర్యటనలపై చర్చ జరుగుతోంది.

గతంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. అంతకుముందు ఓదార్పు యాత్ర చేశారు. ఆ యాత్రలకు ఇప్పుడు చేస్తున్న పర్యటనలకు పెద్దగా తేడా కనిపించడం లేదు. ప్రజల్లో భావోద్వేగాలను ప్రేరేపించే విధంగానే ఈ యాత్రలు సాగుతున్నాయి. మరోవైపు సామాన్య జనాలను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మొన్న జరిగిన గుంటూరు పర్యటన సుమారు 6 గంటల పాటు సాగింది. ఈ పర్యటన కారణంగా నగర ప్రజలు తీవ్ర ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొన్నారు. వైసీపీ యువ కార్యకర్తల హడావుడి కూడా ఎక్కువగానే కనిపించింది. అదే దృశ్యం ఇబ్రహీంపట్నం పర్యటనలో కూడా కనిపించింది.

6 గంటల పాటు జనాన్ని వెంటబెట్టుకుని ప్రయాణం చేయడం, అరగంట పాటు విలేకరులతో మాట్లాడడం, పోలీసులకు మరియు ప్రభుత్వానికి హెచ్చరికలు చేయడం వంటి అంశాలు పునరావృతమవుతున్నాయి. ‘జంగిల్ రాజ్’ అనే పదాన్ని పదేపదే ఉపయోగిస్తున్నారు. అయితే నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే మీరు ఇలా పర్యటనలు చేసేవారా? అని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగుతున్నందునే జగన్ ప్రశాంతంగా పర్యటిస్తున్నారని వారు అంటున్నారు.

జగన్ పర్యటనలపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు పర్యటనపై స్పందిస్తూ, గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లడానికి 6 గంటలు పట్టాలా? రోడ్డుపై ఇంకెవరూ వెళ్లకూడదా? రోడ్డంతా బ్లాక్ చేసి రౌడీయిజం చేస్తారా? అని ప్రశ్నించారు.

మొత్తం మీద వైఎస్ జగన్ పర్యటనలు ఒకే తరహాలో కొనసాగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో పోల్ మేనేజ్మెంట్ ఉన్నట్లే, ఇప్పుడు పబ్లిక్ మేనేజ్మెంట్ తరహాలో పర్యటనలు సాగుతున్నాయని చర్చ జరుగుతోంది. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచడానికి ఇవి ఉపయోగపడవచ్చు. కానీ సామాన్య ప్రజల్లో మాత్రం కొంత అసహనాన్ని కలిగిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

This post was last modified on February 6, 2026 6:53 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

7 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

8 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

8 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

10 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

12 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

13 hours ago