Political News

‘ఆ నెయ్యి’లో బాత్‌రూం క్లీన్ చేసే రసాయనాలు: చంద్రబాబు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆ లడ్డూలో వినియోగించిన నెయ్యిలో మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు ఉపయోగించే రసాయనాలు వాడారని ఆయన తెలిపారు. ఇది భక్తుల మనో విశ్వాసాలతోనే కాదు, తిరుమల శ్రీవారి పవిత్రతతో కూడా ఆడుకోవడం కాదా అని వైసీపీ నాయకులను ఉద్దేశించి చంద్రబాబు ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని వెలికి తీస్తుంటే వైసీపీ నాయకులు ఎదురు దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో శుక్రవారం సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ‘మీ భూమి మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని పలువురికి పట్టా పుస్తకాలను అందించారు. అనంతరం మాట్లాడుతూ తిరుమల శ్రీవారి లడ్డూలో వినియోగించిన నెయ్యిపై వైసీపీ ఎదురు దాడి చేస్తోందని తెలిపారు. ఇప్పటికే నియమించిన కమిటీ కల్తీ జరిగినట్టు స్పష్టంగా చెప్పినా, ఏమీ జరగలేదని పేర్కొంటూ క్లీన్ చిట్ ఇచ్చారనే ప్రచారం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ప్రశ్నిస్తే తమపై దాడులు చేస్తున్నారని సీఎం తెలిపారు. ఒక్క తిరుమల శ్రీవారి లడ్డూలోనే కాకుండా శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తులకు ఇచ్చే ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యి వాడినట్టు తనకు నివేదికలు అందాయని చంద్రబాబు చెప్పారు. వెంటనే సంబంధిత అధికారులను బదిలీ చేశామని, ఆలయాల పవిత్రతను కాపాడుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుమల, శ్రీశైలం లడ్డూ ప్రసాదాలు ఎంతో రుచిగా, పవిత్రంగా ఉన్నాయని భక్తులే చెబుతున్నారని పేర్కొన్నారు.

ఇక పాస్ బుక్స్ ద్వారా రైతులకు, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గతంలో భూములు ఒకరి వాటిని మరొకరు ఆక్రమించుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా చేశామని చెప్పారు. ఎవరి ఫోన్లలో వారు తమ భూముల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. దీనివల్ల రైతులకు, ప్రజలకు భూ కబ్జా సమస్యలు తగ్గుతాయని అన్నారు. అదే సమయంలో లంచాల వ్యవస్థకు కూడా పూర్తిగా అడ్డుకట్ట వేశామని చంద్రబాబు పేర్కొన్నారు.

This post was last modified on February 6, 2026 10:12 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

7 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

9 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

9 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

11 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

12 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

13 hours ago