Political News

‘ఏపీలో కల్తీ రిక్రూట్‌మెంట్ బోర్డు’…అసలేంటిది?

‘ఏపీలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు లాగా జగన్ “కల్తీ రిక్రూట్‌మెంట్ బోర్డు” అనే వ్యవస్థను స్థాపించారు. దానికి ఆయనే అధ్యక్షుడిగా వ్యవహరించారని’ అంటూ ప్రస్తుత హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. ఇంతకీ ఆమె చెప్పిన అధ్యక్షుడు ఎవరో తెలుసా? ఇంకెవరు.. వైయస్ జగన్.

తిరుమలలో కల్తీ వ్యవహారం లో సిట్ నివేదికను ఆధారం చేసుకుని వైసిపి తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్న సమయంలో కూటమి ప్రభుత్వ నేతలు వారికి ధీటుగా సమాధానం ఇస్తున్నారు.

ఈ క్రమంలో హోం మంత్రి అనిత ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. గత ఐదేళ్ల జగన్ మోహన్ రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పీడకలని, అడుగడుగునా కల్తీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని హోం మంత్రి విమర్శించారు.

అంతా కల్తీ మయం..

కోవిడ్ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న జనాభాకు కల్తీ మందులు సరఫరా చేయడంతో మొదలై.. కల్తీ లిక్కర్, చివరకు సామాన్య ఇసుకలో సముద్రపు ఇసుక కలిపి విక్రయించే స్థాయికి జగన్ పాలన దిగజారి పోయిందన్నారు. చివరకు విద్యా వ్యవస్థను, పరీక్షా విధానాలను కూడా కల్తీ చేసి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారని ఆరోపించారు.

ఆ మనిషే ఒక కల్తీ, ఆయన పాలనే ఒక కల్తీ అని మండిపడ్డారు. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ అయిన తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిని కల్తీ చేయడం ద్వారా జగన్ ప్రభుత్వం మహా పాపానికి ఒడిగట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ చెప్పింది అంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, అసలు కల్తీ జరగలేదని నిరూపించడానికి వైసీపీ దగ్గర ఒక్కటంటే ఒక్క అథెంటిక్ రిపోర్ట్ ఉందా? అని ఆమె ప్రశ్నించారు. 

హిందూ ధర్మంలో తిరుమల ప్రసాదానికి ఉన్న పవిత్రత జగన్ మోహన్ రెడ్డికి తెలియదన్నారు. పవిత్రమైన ప్రసాదంలో బాత్రూమ్ క్లీనర్లకు వాడే లబ్సా వంటి కెమికల్స్‌ను, పామాయిల్‌ను, జంతువుల కొవ్వును కలిపి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తారా? అని అనిత మండిపడ్డారు. జగన్ కి హైందవ సంప్రదాయం గురించి తెలియదు కాబట్టే అయోధ్య రామాలయానికి కూడా కల్తీ లడ్డూలు పంపి మహాపచారానికి ఒడిగట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు.

This post was last modified on February 6, 2026 6:51 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

36 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago