న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా 46 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. బ్యాటింగ్ లో సమిష్టిగా రాణించిన భారత్, కివీస్ జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఇషాన్ కిషన్ కేవలం 43 బంతుల్లోనే 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 103 పరుగులు చేసి సెంచరీతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో 63 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 17 బంతుల్లో 42 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అభిషేక్ శర్మ (30), సంజు శామ్సన్ (6) పరుగులు చేయగా, చివర్లో శివం దూబే సిక్సర్‌తో ముగించాడు.
272 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బ్యాటర్లలో ఫిన్ అలెన్ 38 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 80 పరుగులు చేసి భారత్‌ను భయపెట్టాడు. అతనికి తోడుగా రచిన్ రవీంద్ర (30) రాణించినా విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. చివర్లో సోధి (33)తో కాస్త మెరిశాడు. కానీ అప్పటికే కివీస్ నుంచి మ్యాచ్ చేజారింది.
కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం న్యూజిలాండ్ కొంపముంచింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 51 పరుగులిచ్చి 5 వికెట్లతో కివీస్ నడ్డి విరిచాడు. అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, వరుణ్ చక్రవర్తి మరియు రింకూ సింగ్ తలా ఒక వికెట్ సాధించారు.
ముఖ్యంగా 19.4వ ఓవర్‌లో రింకూ సింగ్ ఇష్ సోధిని అవుట్ చేసి మ్యాచ్‌ను ముగించడంతో భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ఈ విజయంతో టీమిండియా 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకుని, రాబోయే టీ20 వరల్డ్ కప్‌కు తాము సిద్ధమని ప్రత్యర్థులకు బలమైన సంకేతాలు పంపింది. ఇషాన్ కిషన్ సెంచరీతో ఫామ్‌లోకి రావడం, అర్ష్‌దీప్ సింగ్ వికెట్ల వేట సాగించడం జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates