న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ ఓటమి నుంచి టీమిండియా త్వరగానే కోలుకుంది. జనవరి 21న నాగ్‌పూర్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో కివీస్‌ను చిత్తు చేసి, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో బోణి కొట్టింది. అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్, అర్ష్‌దీప్ సింగ్ పదునైన బౌలింగ్‌తో భారత్ 47 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 84 పరుగులు చేసి కివీస్ బౌలర్లను వణికించాడు. అతనికి తోడుగా రింకూ సింగ్ (44), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32) వేగంగా పరుగులు సాధించారు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, జేమీసన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ ఒంటరి పోరాటం చేస్తూ 40 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. మార్క్ చాప్మన్ 39 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే చెరో 2 వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ సాధించారు.
మొత్తానికి వన్డే సిరీస్ కోల్పోయిన కసిని భారత్ ఈ మ్యాచ్‌లో చూపించింది. అయితే భారీ స్కోరు సాధించినా, ఫీల్డింగ్‌లో కొన్ని క్యాచ్‌లు వదిలేయడం, బుమ్రా లాంటి ప్రధాన బౌలర్లు పరుగులు సమర్పించుకోవడం టీమ్ మేనేజ్‌మెంట్‌ను కొంత ఆందోళనకు గురిచేసే అంశం. వచ్చే మ్యాచ్‌ల్లో ఈ లోపాలను సరిదిద్దుకుంటే టీమిండియా సిరీస్‌పై పట్టు సాధించడం ఖాయం.
This post was last modified on January 21, 2026 11:01 pm
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే.…
నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఉంటారు. విధి నిర్వహణలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా పనిచేసి ఇటు ప్రజల..అటు…
తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దళపతి…
ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ (I-PAC) ఆర్థిక లావాదేవీలపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. 2021లో ఈ సంస్థ హర్యానాలోని…
రాజకీయ రంగప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న జన నాయకుడుకి కష్టాల కడలి అంత సులభంగా…
మార్చి 27 విడుదలని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిన పెద్ది ఖచ్చితంగా వాయిదా పడుతుందనే రీతిలో సోషల్ మీడియాలో ఒక…