సంక్రాంతి పండుగ అంటే సందడంతా గోదారి జిల్లాల్లోనే ఉంటుంది. తీర్థాలు..రికార్డింగ్ డ్యాన్సులు..కోడి పందేలు..ఇలా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు పండుగ సందర్భంగా ఫుల్ జోష్ లో ఉంటారు. అయితే, పండుగ సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సుల పేరిట యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్న వైనంపై మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఇక, ఈ ఏడాది సంక్రాంతి వేడుకల సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఓ స్టేజి పైకి ఎక్కి యువతితో డ్యాన్స్ వేయడంపై దుమారం రేగుతోంది. మరోవైపు, జనసేన నేత ఒకరు ఏకంగా డ్యాన్సర్లను అర్ధనగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ పబ్లిక్ గా డిమాండ్ చేసిన వైనం వివాదాస్పదమైంది. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందించారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ అనుచరుడు గోగన్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఏకంగా స్టేజిపైకి ఎక్కి మరీ డ్యాన్సర్లు దుస్తులు విప్పి అర్ధనగ్నంగా డ్యాన్స్ చేయాలని ఆయన కోరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోపై స్పందించిన చిన్మయి…తీవ్రస్థాయిలో విమర్శించారు. పబ్లిక్ గా ఆ మహిళలను అలా చేయమని అడగడం ఏమిటని చిన్మయి మండిపడ్డారు.
ఇక, ఆయన అడగడం…అందుకు స్టేజిముందున్న వారంతా కేరింతలు కొట్టడం జుగుప్సాకరంగా ఉందని ఫైర్ అయ్యారు. ఇటువంటి అసభ్యకరమైన కార్యక్రమాల గుట్టురట్టవుతున్నందుకు సంతోషించాలో..ఇంకా ఇటువంటి వారున్నారా అని బాధపడాలో అర్థం కావడం లేదన్నారు.
పల్లెటూళ్లలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ తరహా రికార్డింగ్ డ్యాన్సులు మామూలే అని, ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నాయని అనుకోవచ్చు. సరదాగా ఆ 3 రోజులు గడపడంలో తప్పేమీ లేదని చాలామంది సమర్థించుకోవచ్చు కూడా. కానీ, ఇప్పుడు కాలం మారింది. కాలంతో పాటు ఆ టైపు కార్యక్రమాలు నిర్వహించే వారి మైండ్ సెట్ కూడా మారాలి. ఇటువంటి అసభ్యకర, అశ్లీల కార్యక్రమాలు సంక్రాంతి పండుగ విశిష్టతను దెబ్బతీస్తున్నాయన్న విషయాన్ని ఆ కార్యక్రమాల నిర్వాహకులు, వాటిని ఆస్వాదిస్తున్న ప్రజలు గుర్తించాలి.
సంస్కృతీసంప్రదాయాలను మరిచిపోతున్న జెన్ జెడ్ తరానికి పండుగ అంటే భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు, గొబ్బిళ్లు, గాలిపటాలు, హరిదాసులు..ఇవి గుర్తుకు రావాలి. అంతేగానీ, అర్ధనగ్న రికార్డింగ్ డ్యాన్సులు, బెట్టింగులను మించిపోయే కోడిపందేలు కాదు. అయితే, మార్పు ఒక్కసారిగా రాకపోవచ్చు. కానీ, క్రమక్రమంగా అటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆపేస్తే కొన్నాళ్ల తర్వాతయినా ఆ డర్టీ కల్చర్ మారుతుంది.
This post was last modified on January 17, 2026 2:50 pm
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఆకర్షణీయమైన హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి…
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఈ సంక్రాంతికి చిరస్మరణీయమే. చిరు కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర…
గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన కలం కవల్ కేరళలో సెన్సేషనల్ సక్సెస్ అందుకుంది. తక్కువ బడ్జెట్ లో వేగంగా…
సోషల్ మీడియాలో ఇటీవల కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు లక్కీ డ్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. కార్లు, బైకులు,…
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత క్లోజ్ ఫ్రెండ్సో ఆర్ఆర్ఆర్ టైంలో అందరికీ అర్థం…
సికింద్రాబాద్ను మల్కాజ్గిరి కార్పొరేషన్లో విలీనం చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్…