Trends

రీల్స్‌లో బిల్డప్.. రియాలిటీలో మోసం

సోషల్ మీడియాలో ఇటీవల కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు లక్కీ డ్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. కార్లు, బైకులు, ప్లాట్లు, ఖరీదైన గాడ్జెట్లు ఇస్తామని రీల్స్ చేసి, అమాయకులను ఆకర్షిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.

ఇంతకుముందు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లతో డబ్బులు చేసుకున్న ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఇప్పుడు అదే మోసాన్ని లక్కీ డ్రాల రూపంలో కొనసాగిస్తున్నారు. భారీ బహుమతులు గెలుస్తారని నమ్మించి, చిన్న మొత్తాలు చెల్లించమని చెప్పి ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుంటున్నారు.

ఈ తరహా లక్కీ డ్రాలు చట్టవిరుద్ధమని, ప్రజలను మోసం చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. Prize Chits and Money Circulation Schemes Banning Act 1978 ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

మోసాలకు పాల్పడేవారు సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్లైనా ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటే చట్టం ముందు తప్పించుకునే అవకాశం ఉండదన్నారు.

ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, లక్కీ డ్రాలు, భారీ బహుమతుల పేరుతో వచ్చే ఆఫర్లను నమ్మి డబ్బులు చెల్లించవద్దని అధికారులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే హడావుడికి మోసపోకుండా, నిజమైన సమాచారం తెలుసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

This post was last modified on January 17, 2026 1:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హుక్ స్టెప్ క్రెడిట్ చిరుదేనా?

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఈ సంక్రాంతికి చిరస్మరణీయమే. చిరు కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర…

6 minutes ago

సంక్రాంతి అంటే రికార్డింగ్ డ్యాన్సులేనా?

సంక్రాంతి పండుగ అంటే సందడంతా గోదారి జిల్లాల్లోనే ఉంటుంది. తీర్థాలు..రికార్డింగ్ డ్యాన్సులు..కోడి పందేలు..ఇలా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు పండుగ…

52 minutes ago

కలం కవల్… మన కప్ ఆఫ్ టీ కాదు

గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన కలం కవల్ కేరళలో సెన్సేషనల్ సక్సెస్ అందుకుంది. తక్కువ బడ్జెట్ లో వేగంగా…

1 hour ago

తారక్ 250 స్పీడ్ మీద డ్రైవ్ చేస్తాడా

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత క్లోజ్ ఫ్రెండ్సో ఆర్ఆర్ఆర్ టైంలో అందరికీ అర్థం…

1 hour ago

కేటీఆర్ నోట ‘తుగ్లక్ సీఎం’ మాట

సికింద్రాబాద్‌ను మల్కాజ్‌గిరి కార్పొరేషన్‌లో విలీనం చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్…

2 hours ago

జాక్ పాట్ కొడుతున్న ‘డ్రాగన్’ హీరో

భాషతో సంబంధం లేకుండా యూత్ లో మంచి వైబ్ ఉన్న పేరు ప్రదీప్ రంగనాథన్. 2026లో డ్రాగన్, డ్యూడ్ రూపంలో…

2 hours ago