వారిది స్థితిమంతమైన కుటుంబం.. ఆ కుటుంబంలో పెళ్లంటే మాటలా…? విందులు, వినోదాలు, ఖర్చుకు కొదవేముంది.. అయితే ఇవన్నీ కాదనుకుని అదే ఖర్చుతో పేదల ఇళ్లలో పెళ్లిళ్లు జరిపించి తన మానవత్వాన్ని చాటుకున్నారా పెద్దాయన.
“పెళ్లి విందుకు కోటి ఖర్చు పెట్టేదేంటి?” అని ఒక రాత్రి ఆలోచించిన బారిస్టర్ హఫీజ్ మొహ్మద్ తాహుద్దీన్, ఆ ఆలోచన పక్కన పెట్టి సరికొత్త ఆలోచన చేసి అందరి మన్ననలను అందుకున్నారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్ శివరాంపల్లిలో నివసించే ఆయన, మకర సంక్రాంతి రోజున కుమారుడి పెళ్లి పెట్టుకున్నారు. ముందుగా భారీ విందు ప్లాన్ చేశారు. మెనూలో బిర్యానీ నుంచి అదిరిపోయే తీపి పదార్ధాల వరకు అన్నీ సిద్ధం చేయసుకున్నారు. కానీ మధ్యలో మనసు మార్చకున్నారు.
“కుమారుడికి జీవితమంతా ఇచ్చేశాను పెళ్లి విందు కాస్త తగ్గితే ప్రపంచం కూలిపోదు” అని డిసైడ్ అయ్యారు. వెంటనే మిత్రుడు జఫర్ అహ్మద్ సిద్ధిఖి, సంక్షేమ సంఘ సభ్యులతో చర్చించారు. ఆ వెంటనే పెళ్లి ఖర్చుల భారంతో పెళ్లి విందు వాయిదా వేసుకుని..దానికి ఉద్దేశించిన కోటి రూపాయలతో పెళ్లికి సిద్ధంగా ఉన్న ఆరు పేద జంటలకు ఖరీదైన ఫర్నిచర్ అందించారు.
అదిరిపోయేలా వారి పెళ్లిళ్లు జరిపించారు. ఇక శనివారం జరగనున్న తన కుమారుడి పెళ్లి విందును భారీగా కాకుండా చిన్నగానే జరిపించాలని ఆయన నిశ్చయించుకున్నారట..! ఈ విషయం సోషల్మీడియాలో వైరల్ కావడంతో ఆయన పెద్ద మనసును చూసి అంతా అభినందనలు తెలుపుతున్నారు.
This post was last modified on January 17, 2026 9:52 am
సూపర్ స్టార్ మహేష్ బాబు మాములుగా చాలా రిజర్వ్డ్ గా కనిపిస్తాడు. ఎక్కువగా మాట్లాడడు. కానీ ఆయనతో పనిచేసిన వాళ్ళు…
ఇంత పెద్ద కాంపిటీషన్, అందులోనూ మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ ని తట్టుకుని బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోవడం అంత…
ఆలు లేదు చూలూ లేదు అని ఏదో సామెత చెప్పినట్టు ఇంకా ఏడాది సమయం ఉండగానే 2027 సంక్రాంతి రిలీజుల…
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి…
ఎవరూ ఊహించని విధంగా నిన్న సాయంత్రం స్పిరిట్ రిలీజ్ డేట్ ప్రకటించడం ప్రభాస్ ఫ్యాన్స్ ని ఒక్కసారిగా షాక్ కు…
ఒకప్పుడు వైభవం చూసిన స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల.. గత కొన్నేళ్లుగా హీరోలు, నిర్మాతలు దొరక్క ఇబ్బంది పడుతున్న సంగతి…