సంక్రాంతి వస్తే చాలు పతంగులు ఎగురవేసేందుకు చిన్నా, పెద్దా అంతా ఆసక్తి చూపుతుంటారు. అయితే, దారంతో కాకుండా చైనా మాంజాతో పతంగులు ఎగురవేయొద్దని, నిషేధం విధించిన చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నా చాలామంది ఆ మాట పెడచెవిన పెడుతున్నారు.
ఈ సంక్రాంతి సందర్భంగా కూడా చైనా మాంజా బారిన పడి ఇద్దరు మృతి చెందగా..పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే చైనా మాంజా కట్టడి కోసం నిజామాబాద్ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు.
చైనా మాంజా అమ్మితే హత్యాయత్నం కేసు నమోదు చేస్తున్నారు. నిజామాబాద్ లో ఆల్రెడీ ఐదుగురు వ్యాపారులపై అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి 35 బండిళ్ల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. చైనా మాంజా విక్రయాల కట్టడికి ఇటువంటి కఠిన చర్యలు తప్పడం లేదని చెబుతున్నారు.
మాంజా విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న వెంటనే ఆ దుకాణాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నా, సూచనలు చేస్తున్నా వినకపోవడంతోనే హత్యాయత్నం కేసులు నమోదు చేయాల్సి వస్తోందని పోలీసులు అంటున్నారు.
తాజాగా సంగారెడ్డి జిల్లాలో చైనా మాంజా మరొకరిని బలి తీసుకుంది. ఫసల్వాది గ్రామంలో చైనా మాంజా తగిలి బైక్ పై వెళుతున్న వ్యక్తి గొంతు తెగిపోయింది. బైక్ మీద వెళ్తున్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన అవిదేశ్‌కు చైనా మాంజ మెడకు బలం తగలడంతో గొంతు తెగి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆ తర్వాత అతడు మృతి చెందాడు. యూపీ నుండి కూలీ పని కోసం సంగారెడ్డికి నిన్న వచ్చిన అవిదేశ్ ను చైనా మాంజా బలి తీసుకుంది. దీంతో, లోహ్రీ పండుగ నాడు అవిదేశ్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
This post was last modified on January 15, 2026 1:45 pm
మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ ఎలాంటి విధ్వంసం సృష్టించగలరో ‘మన శంకర వరప్రసాద్…
పండగ చివర్లో వచ్చిన సినిమా నారి నారి నడుమ మురారి. ప్రీమియర్లు పడే దాకా అండర్ డాగ్ గా ఉంటూ…
రాజకీయ రంగప్రవేశానికి ముందు చివరి సినిమాగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న జన నాయకుడుకి మోక్షం ఎప్పుడో అర్థం కాక అభిమానులు…
నిన్న లోకేష్ కనగరాజ్ అనౌన్స్ మెంట్ వచ్చాక అల్లు అర్జున్ సినిమాల గురించి మరోసారి చర్చ మొదలయ్యింది. ఎందుకంటే అట్లీది…
ఇది కేరళ కాదు… ఆంధ్రప్రదేశ్లోని ఆత్రేయపురం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆత్రేయపురంలో పండుగ వాతావరణం నెలకొంది అంటూ మంత్రి నారా…
2026 బాక్సాఫీస్ సంక్రాంతి ప్రధాన ఘట్టం అయిపోయింది. మొత్తం అయిదు సినిమాల స్క్రీనింగ్లు అయిపోయాయి. టెక్నికల్ గా నారి నారి…