మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి పందేలు ప్రధాన ఆకర్షణ. ఒకప్పుడు గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితమైన కోడి పందేలు.. పొట్టేలు పందేలు.. తర్వాత తర్వాత.. కొన్ని కొన్ని చుట్టుపక్కల గ్రామాలకు పాకాయి. అయితే.. రాను రాను ఇప్పుడు గోదావరి, కృష్ణానదులను కూడా దాటుకుని.. ప్రాంతాలకు.. రాష్ట్రాలకు కూడా విస్తరిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే..ఐపీఎల్ మ్యాచ్‌లకు చేసే హడావుడి కోడి పందేలకు చేస్తున్నారు.
భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు. విందు వినోదాలతోపాటు.. కోడిపందేలకు వచ్చే పందెంరాయుళ్లకు ఆహ్వాన పత్రాలు కూడా ఈ ఏడాది అందించడం గమనార్హం. అయితే.. ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది.
విజయవాడ సహా.. కృష్ణాజిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ భారీ ఎత్తున కోడి పందేల శిబిరాలు వెలిశాయి. ఇదేదో చాటు మాటు అనుకుంటే పొరపాటే.. బహిరంగ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేశారు. వాటిలో ఎల్ ఈడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీ, సాధారణ, మధ్యతరగతి.. అంటూ.. ఇలా నాలుగు రకాలుగా బరుల్లో సీటింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు.
వచ్చే వారికి విందు ఏర్పాట్లు అదిరిపోతున్నాయి. నాన్ వెజ్ సహా చైనీస్, సముద్ర ఆహారం ఇలా.. అనేక రకాల నాన్ వెజ్ పదార్థాలను ఏర్పాటు చేశారు. విజయవాడకు చెందిన ప్రముఖ హోటల్‌కు క్యాటరింగ్ ఇచ్చారు. సుమారు 10 వేల మంది వీవీఐపీలకు భోజనంవడ్డించే బాధ్యతను ఈ సంస్థకు అప్పగించారు.
ఒక్కొక్క ప్లేట్ 3 వేల రూపాయల చొప్పున ఈ సంస్థ వసూలు చేస్తోందంటే.. ఏ రేంజ్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయో తెలుస్తోంది. ఇక, సాధారణ పందెం.. 50 వేల కు పైమాటేనని పందెం రాయుళ్ల మధ్య జరుగుతున్న చర్చలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్ శివారులో..
ఇక, తెలంగాణలో కోడిపందేలకు ఒకప్పుడు చోటు లేదు. కానీ.. ఈ సారి హైదరాబాద్ చుట్టుపక్కలప్రాంతాల్లో 100కు పైగా కోడిపందేల బరులు వెలిశాయి. చిత్రం ఏంటంటే.. ఏపీ హైకోర్టు తెలంగాణ హైకోర్టు కూడా బరులు వేయొద్దని.. కోడి పందేలు నిర్వహించవద్దని తేల్చి చెప్పాయి.
కానీ.. ఈ ఆదేశాలు.. ఆ మూడు రోజులు కోర్టు గడపలకే పరిమితం అవుతున్నాయి. ఇదిలావుంటే.. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా నాయకులే ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మరో చిత్రం ఏంటంటే.. రాజకీయ ప్రత్యర్థులుగా నిత్యం కొట్టుకునే.. టీడీపీ-జనసేన-వైసీపీ నాయకులు ఈ దఫా కలిసిపోయారు.
This post was last modified on January 11, 2026 10:21 pm
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…