Trends

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు చెబుతుంటారు. రీసెంట్‌గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఆయన తన జీవనశైలి గురించి చెప్పిన విషయాలు విని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మనం రోజూ చేసే పనులను ఆయన పక్కన పెట్టి దశాబ్దాలు గడుస్తున్నా.. ఆయన అంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

సాధారణంగా మనం ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేయకుండా కాఫీ కూడా తాగం. కానీ మంతెన గారు గత 15 ఏళ్లుగా బ్రష్ కూడా చేయలేదని చెప్పడం సంచలనంగా మారింది. బ్రష్ చేయడం, పేస్ట్ వాడటం వల్ల పళ్లు క్లీన్ అవుతాయని అనుకోవడం పొరపాటని ఆయన అభిప్రాయపడ్డారు. తిన్న ఆహారం పద్ధతిగా ఉంటే పళ్లను తోముకోవాల్సిన అవసరమే ఉండదని ఆయన తన అనుభవం ద్వారా వివరించారు.

ఇక సబ్బుల విషయానికి వస్తే ఆయన చెప్పిన మాటలు మరీ ఆశ్చర్యకరంగా ఉన్నాయి. గత 35 ఏళ్లుగా ఆయన ఒంటికి సబ్బు ముట్టుకోలేదట. సున్నిపిండి లాంటి ప్రకృతి సిద్ధమైన పదార్థాలను కూడా వాడకుండా కేవలం నీళ్లతోనే స్నానం చేస్తున్నానని చెప్పారు. మన శరీరానికి సహజంగా ఉండే రక్షణ కవచాన్ని సబ్బులు దెబ్బతీస్తాయని.. అందుకే సబ్బును పూర్తిగా పక్కన పెట్టేసి మూడు దశాబ్దాలు దాటిందని ఆయన వెల్లడించారు.

చెమట వాసన అనేది నేటి తరం యువతకు పెద్ద తలనొప్పి. కానీ మంతెన గారు మాత్రం తన శరీరానికి చెమట వాసన రాదని గట్టిగా చెబుతున్నారు. దీనికోసం ఆయన ఒక టెస్ట్ కూడా చేశారట. ఆరు నెలల పాటు ఉతకని సాక్సులను వాడి చూసినా ఎటువంటి కంపు రాలేదని చెప్పారు. పది రోజుల పాటు వరుసగా ఒకే జత బట్టలు వాడినా ఇబ్బంది కలగలేదని ఆయన చెప్పిన తీరు అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

ఈ విధమైన నియమాలు పాటించడం వల్ల కలిగే ఫలితాల గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. గత 35 ఏళ్లలో తనకు ఒక్కసారి కూడా తలనొప్పి రాలేదని.. కనీసం వాంతులు లేదా లూజ్ మోషన్స్ లాంటి చిన్న సమస్యలు కూడా దరిచేరలేదని స్పష్టం చేశారు. సమాజానికి ఒక హెల్దీ బాడీ ఎలా ఉంటుందో చూపించడమే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. న్యాచురల్ ఫుడ్, ప్రకృతికి దగ్గరగా ఉంటే హాస్పిటల్స్ అవసరమే ఉండదనేది ఆయన సందేశం ఇచ్చారు.

This post was last modified on January 11, 2026 12:54 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

11 minutes ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

48 minutes ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

2 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

3 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

3 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

4 hours ago