Trends

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా అడుగుపెడుతుంటే ఫ్యాన్స్ కళ్లన్నీ ఇద్దరు దిగ్గజాల మీదనే ఉన్నాయి. వారే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. వీరిద్దరూ ఇప్పటికే టెస్టులు, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేల్లో మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ ఒక అరుదైన రికార్డ్ ని అధిగమించారు. టీమ్ ఇండియా తరఫున అత్యంత సుదీర్ఘ కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ప్లేయర్ల జాబితాలో రోహిత్ ఇప్పుడు ఆరో స్థానానికి ఎగబాకారు. గత వారమే ఆయన దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించడం విశేషం.

రోహిత్ శర్మ క్రికెట్ జర్నీ మొదలై ఇప్పటికి 18 ఏళ్ల 201 రోజులు పూర్తయింది. 24 ఏళ్ల పాటు ఆడిన సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. మొహిందర్ అమర్‌నాథ్, లాలా అమర్‌నాథ్ లాంటి దిగ్గజాలు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆశిష్ నెహ్రా, వెంకటరాఘవన్ లాంటి సీనియర్ల సరసన రోహిత్ ఇప్పుడు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత సుదీర్ఘ కెరీర్ కలిగిన భారతీయ ఆటగాళ్ల లిస్ట్:

​సచిన్ టెండూల్కర్ (1989-2013): 24 ఏళ్ల 1 రోజు

​మొహిందర్ అమర్‌నాథ్ (1969-1989): 19 ఏళ్ల 310 రోజులు

​లాలా అమర్‌నాథ్ (1933-1952): 19 ఏళ్ల 0 రోజులు

​ఆశిష్ నెహ్రా (1999-2017): 18 ఏళ్ల 250 రోజులు

​ఎస్.వెంకటరాఘవన్ (1965-1983): 18 ఏళ్ల 214 రోజులు

​రోహిత్ శర్మ (2007-2026): 18 ఏళ్ల 201 రోజులు

​అనిల్ కుంబ్లే (1990-2008): 18 ఏళ్ల 191 రోజులు

​దినేష్ కార్తీక్ (2004-2022): 18 ఏళ్ల 58 రోజులు

ఇతర ఫార్మాట్ల నుంచి తప్పుకోవడంతో రోహిత్ తన ఫోకస్ అంతా వన్డేల మీదనే పెట్టారు. తన ఫిట్నెస్ ని కాపాడుకుంటూ జట్టుకు అవసరమైన హిట్టింగ్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2007లో ఒక సాధారణ యువకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన రోహిత్.. ఇప్పుడు ఒక ఐకాన్ గా ఎదిగారు.

దినేష్ కార్తీక్ లాంటి సీనియర్లను సైతం వెనక్కి నెట్టి టాప్ 6 లోకి రావడం అతని నిలకడకు నిదర్శనం. పద్దెనిమిది ఏళ్లకు పైగా హై లెవల్ క్రికెట్ ఆడటం అనేది మామూలు విషయం కాదు. ఎన్నో గాయాలు, ఒడిదుడుకులను తట్టుకుని నిలబడటం వల్లే ఇది సాధ్యమైంది. మరి న్యూజిలాండ్ తో జరగబోయే ఈ సిరీస్ లో హిట్ మ్యాన్ తన రికార్డుల జోరును ఎలా కొనసాగిస్తారో చూడాలి.

This post was last modified on January 11, 2026 11:58 am

Share
Show comments
Published by
Kumar
Tags: Rohit Sharma

Recent Posts

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

7 minutes ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

24 minutes ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

53 minutes ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

2 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

2 hours ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

3 hours ago